సుమంత్ కెరీర్ కు అగ్నిప‌రీక్ష‌.. 

ఇండ‌స్ట్రీలో కావాల్సింది బ్యాగ్రౌండ్ కాదు.. టాలెంట్. ఒక్కోసారి అది ఉన్నా కూడా అదృష్టం కూడా క‌లిసి రావాలి. అలా క‌లిసిరాకే ఇప్ప‌టికీ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు సుమంత్. వార‌స‌త్వం, టాలెంట్ రెండూ ఉన్నా.. అదృష్టం లేక స్టార్ స్టేట‌స్ కు దూరంగా ఉన్న హీరో సుమంత్. అక్కినేని కుటుంబ బ్యాగ్రౌండ్ ఉంది.. పైగా చూడ్డానికి బాగుంటాడు.. అన్నింటికి మించి న‌టుడు కూడా.. ఇన్ని ఉన్నా కూడా సుమంత్ ను ల‌క్ క‌రుణించ‌ట్లేదు. గ‌త 20 ఏళ్లుగా కెరీర్ ను మ‌లుపు తిప్పే స‌రైన స‌క్సెస్ కోసం వేచి చూస్తునే ఉన్నాడు. స‌త్యం, గౌరి, గోదావ‌రి లాంటి సినిమాల‌తో సుమంత్ ఇప్ప‌టికే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే స్టార్ గా మాత్రం మార‌లేదు.
గ‌తేడాది వ‌చ్చిన న‌రుడా డోన‌రుడా కూడా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు ఈయ‌న మ‌రో సినిమాతో వ‌స్తున్నాడు. అదే మ‌ళ్లీ రావా. కొత్త ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. కేవ‌లం 30 రోజుల్లోనే మ‌ళ్లీ రావా షూటింగ్ పూర్తి చేసామ‌ని చెప్పాడు సుమంత్. డిసెంబ‌ర్ 8న‌ ఈ చిత్రం విడుద‌లవుతుంది. ఈ చిత్రాన్ని స‌మంత‌, నాగ‌చైత‌న్య ప్ర‌మోష‌న్ చేసారు. రొమాంటిక్ ఎంటైర్ టైన‌ర్ గా వ‌చ్చిన మ‌ళ్లీరావాపై సుమంత్ చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు మ‌రో సినిమాకు కూడా క‌మిట‌య్యాడు సుమంత్. ఈ చిత్ర షూటింగ్ వైజాగ్ లో మొద‌లైంది. మ‌రి ఈ రెండు సినిమాల‌తోనైనా సుమంత్ మ‌ళ్లీ హిట్ కొడ‌తాడా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here