సూర్య టైమ్ స్టార్ట్స్ నౌ.. రాస్కోరా సాంబ‌..!


అదేంటి.. ఇప్పుడు సూర్య‌కు పెద్ద‌గా టైమ్ క‌లిసి రావ‌డం లేదు.. అందులోనూ వ‌ర‌స‌గా ఐదు ఫ్లాపులు ఉన్నాయి క‌దా ఇప్పుడు టైమ్ స్టార్ట్స్ నౌ ఏంటి అనుకుంటున్నారా..? అవును.. కానీ ఇప్పుడు చేస్తోన్న సినిమాలే సూర్య కెరీర్ ను నిర్ణ‌యించ‌నున్నాయి. సింగం 2 త‌ర్వాత సూర్య‌కు హిట్ లేదు. 24 తెలుగులో విజ‌యం సాధించినా అస‌లైన త‌మిళ్లో ఫ్లాప్. ఇక సింగం 3 కూడా జ‌ల్లిక‌ట్టుకు బ‌లైపోయింది. మొన్నొచ్చిన గ్యాంగ్ కూడా తెలుగులో ఓకే కానీ త‌మిళ్ లో ఫ్లాప్. దాంతో ఇప్పుడు క‌చ్చితంగా హిట్ కొట్టాల్సిన ప‌రిస్థితుల్లో ప‌డిపోయాడు. ఒక‌ట్రెండు ఫ్లాపులంటే ఏదో అనుకోవ‌చ్చు గానీ వ‌ర‌స‌గా ఇన్నేళ్లు.. ఇన్నిసినిమాలు.. ప‌రాజ‌యాలు వ‌స్తున్నాయంటే పొర‌పాటు ఎక్క‌డుంద‌నుకోవాలి..?  సూర్య‌ కు క‌థ‌ల ఎంపిక చేత‌కావ‌ట్లేదా.. లేదంటే నిజంగానే ప్రేక్ష‌కులు త‌న‌నుంచి ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోలేక‌పోతున్నాడా..?
ఈయ‌న ప్ర‌స్తుతం సెల్వ‌రాఘ‌వ‌న్ తో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి ఎన్ జి కే అనే టైటిల్ పెట్టారు. అంటే నంద గోపాల కుమ‌ర‌న్ అని అర్థం. ఈ చిత్రం సూర్య‌కు క‌చ్చితంగా హిట్ తీసుకొస్తుంద‌ని న‌మ్ముతున్నారు అభిమానులు. పైగా ఈ చిత్రంలో సూర్య పాత్ర కొత్తగా ఉంటుందంటున్నాడు సెల్వ‌. ఈయ‌న సినిమాలు అర్థ‌మైతే అద్భుతం చేస్తాయి.. లేదంటే దారుణంగా బోల్తా కొడ‌తాయి. ఇదే రిస్క్ అనుకుంటే ఇప్పుడు మ‌రో సినిమాకు సై అనేసాడు సూర్య‌. అయ‌న్ తో త‌న‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన కేవీ ఆనంద్ తో ఓ సినిమా చేస్తున్నాడు సూర్య‌. అయ‌న్ తెలుగులో వీడొక్క‌డేగా విడుద‌ల అయింది. ఆ త‌ర్వాత ఈ కాంబినేష‌న్ లో వ‌చ్చిన బ్ర‌ద‌ర్స్ డిజాస్ట‌ర్ అయింది. కానీ బ్ర‌ద‌ర్స్ త‌ర్వాత కేవీ త‌మిళ్ లో రెండు హిట్లు కొట్టాడు. ఇదే సూర్య అభిమానుల్లో న‌మ్మ‌కం పెంచేస్తుంది. ఈ చిత్రానికి హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. జూన్ నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. మ‌రి ఈ రెండు సినిమాల‌తో సూర్య కెరీర్ ఎటువైపు వెళ్ల‌నుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here