సమ్మర్ లో రంగస్థలం రప్ఫాడిస్తుంది. సీజన్ కు అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చింది. ఇప్పుడు మరో రెండు సినిమాలు ఈ వేసవిలోనే రానున్నాయి. అవే భరత్ అనే నేను.. నా పేరు సూర్య. మండే ఎండల్లో ఈ రెండు సినిమాలు రాబోతున్నాయి. ఎప్రిల్ 20న భరత్ అనే నేను విడుదల కానుంది. ఇక నా పేరు సూర్య కూడా మే 4న విడుదల కానుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ ఇంపాక్ట్ ఇప్పటికే విడుదలై సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు డైలాగ్ ఇంపాక్ట్ రానుంది. టీజర్ అనే మాటే లేకుండా ఇంపాక్ట్ తోనే వస్తున్నాడు వక్కంతం వంశీ. ఎప్రిల్ 8న అల్లుఅర్జున్ పుట్టినరోజు సందర్భంగా డైలాగ్ ఇంపాక్ట్ విడుదల కానుంది. ఇందులో బన్నీ లుక్ కూడా చాలా రఫ్ గా ఉంది. నోట్లా చుట్ట పెట్టుకుని పొగ తాగుతూ స్టైలిష్ హెయిర్ స్టైల్ తో రప్ఫాడిస్తున్నాడు అల్లు వారబ్బాయి. అను ఎమ్మాన్యువల్ హీరోయిన్ గా వస్తోన్న ఈ చిత్రాన్ని నాగబాబు, లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. వరస విజయాలతో దూసుకుపోతున్న బన్నీకి గతేడాది డిజే రూపంలో అనుకోని బ్రేక్ పడింది. ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించినా.. యావరేజ్ గానే నిలిచింది. దాంతో ఇప్పుడు నా పేరు సూర్యతో బ్లాక్ బస్టర్ అందుకుని తన సత్తా ఏంటో చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు అల్లుఅర్జున్. మరి చూడాలిక.. ఈయన డైలాగ్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో..?