సైకిల్ డైలాగ్ తేడా కొడుతుంది ప‌వ‌న్..

Pawan Kalyan cycle dialogue in Agnathavasi
అజ్ఞాత‌వాసి సినిమా చూసిన వాళ్ళ‌కు ఇప్పుడు ఒక్క డైలాగ్ మాత్రం చాలా డౌట్లు రైజ్ చేస్తుంది. ఇందులో మాట్లాడితే సైకిల్ ఎక్కుతుంటాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. దానికితోడు వెన‌క నుంచి డైలాగులు కూడా వ‌స్తుంటాయి.. చిన్న‌ప్ప‌ట్నుంచీ వీడికి సైకిల్ పిచ్చి మాత్రం పోలేదు అని..! ఇవ‌న్నీ చూస్తుంటే ఇప్పుడు రాజ‌కీయాల‌కు డైలాగులు బాగా సూట్ అవుతాయేమో అనిపిస్తుంది. ప‌వ‌న్ ఇప్పుడు తెలుగుదేశం మిత్ర‌ప‌క్షం అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. గ‌త ఎన్నిక‌ల్లో టీడిపిని విజ‌య‌ప‌థంలో న‌డ‌వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కూడా ప‌వ‌ర్ స్టారే. ఈ విష‌యం అప్ప‌ట్లో చంద్ర‌బాబు కూడా ఒప్పుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు అజ్ఞాత‌వాసిలో సైకిల్ ఎక్కుతా.. ఎక్కుతా అనే డైలాగ్ మాత్రం ఎక్క‌డో తేడా కొడుతుంది. ఈయ‌న ఎప్పుడూ తెలుగు దేశంతోనే ఉంటాడా అనే అనుమానం వ‌స్తుంది. తాను ఏ పార్టీకి చెంద‌నివాడిని కాదు.. జ‌న‌సేన ఎవ‌రికి తొత్తు కాదు.. విలీనం చేయ‌నంటూనే ఈ త‌ర‌హా డైలాగులు చెప్ప‌డ‌మేంటో మ‌రి..? ఇది కేవ‌లం సినిమా వ‌ర‌కే అనుకోవాలా లేదంటే బ‌య‌ట కూడా అప్లై చేసుకోవాలా..? ఏమో ఇప్పుడు ఇది తెలియ‌కే అభిమానులు క‌న్ఫ్యూజ్ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here