సైరాకు మరో అడ్డంకి..


చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరాకు అన్నీ ఆదిలోనే అడ్డంకులు వ‌స్తున్నాయి. కానీ అన్నింటినీ దాటుకుని సైరా షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే 40 శాతం షూట్ పూర్త‌యింది. ప్రస్తుతం హైద‌రాబాద్ లో షెడ్యూల్ జ‌రుగుతుంది. అయితే ఇప్పుడు మ‌రో అడ్డంకి కూడా వ‌చ్చింది ఈ సినిమాకు. అదే వ‌ర్షం. వ‌రుణ దేవుడు సైరా యూనిట్ ను క‌రుణించ‌డం లేదు. నైట్ ఎఫెక్ట్ తో జ‌రుగుతున్న షూటింగ్ కు ఈయ‌న అడ్డు ప‌డుతున్నాడు.
రెండు మూడు రోజుల నుంచి ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. చిరంజీవితో పాటు మిగిలిన అంద‌రూ కూడా ప్యాక‌ప్ చెప్పి ఖాళీగానే ఉన్నారు. మ‌రోవైపు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి కూడా వ‌రుణ దేవుడు శాంతించాలంటూ మొక్కుకుంటున్నాడు. చిన్న బ్రేక్ వ‌చ్చినా కూడా ఇంత‌మంది డేట్స్ ఒకేసారి దొర‌క‌డం క‌ష్టం కాబ‌ట్టి మొత్తం షెడ్యూల్ అప్ సెట్ అయ్యే ప్ర‌మాదం లేక‌పోలేదు.
దాంతో వ‌ర్షం త‌గ్గిన త‌ర్వాత వెంట‌నే షూట్ ప్రారంభించాల‌ని చూస్తున్నారు సైరా యూనిట్. కోకో పేట్ లోని ప్ర‌త్యేక‌మైన సెట్ లో సైరా షూటింగ్ జ‌రుగుతుంది. దాంతోపాటు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇష్యూ కూడా సైరాను ఇబ్బంది పెడుతుంది. ఈ చిత్రానికి ఇంకా సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌రో ఖ‌రారు కాలేదు. అయితే ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా కూడా అన్నీ దాటుకుని ముందుకెళ్తున్నాడు సైరా న‌ర‌సింహారెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here