`సైరా న‌ర‌సింహారెడ్డి` షూటింగ్ ప్రారంభం

అటు అభిమానులు..ఇటు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న‌ 151వ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` బుధ‌వారం అధికారికంగా సెట్స్ కు వెళ్లింది. హైద‌రాబాద్ లోనే నేటి నుంచి డిసెంబ‌ర్ 22 వ‌ర‌కూ సినిమా కోసం ప్ర‌త్యేకంగా నిర్మించిన సెట్స్ లో  ఏక‌ధాటిగా షూటింగ్ జ‌ర‌గ‌నుంది.
ఈ క్రేజీ చిత్రానికి స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌త్న‌వేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫైట్ మాస్ట‌ర్ లీ విట్టేక‌ర్ సార‌థ్యంలో కీల‌క యాక్ష‌న్ సన్నివేశాలు తెర‌కెక్కించ‌నున్నారు.ఈ హిస్టారిక‌ల్ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో  మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీపై నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here