స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య సాంగ్ కి సినిమాటోగ్ర‌ఫి అందించిన‌ హ‌లీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్‌ జోసెఫ్ లబిసి

NSNI
ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ మరియు ఇంగ్లీష్ పాప్ సాంగ్స్ సినిమాటోగ్రాఫర్ జోసెఫ్ ల‌బిసి మెట్ట‌మెద‌టి సారిగా అల్లు అర్జున్ న‌టించిన నాపేరు సూర్య‌- నా ఇల్లు ఇండియా చిత్రంలో ఓ సాంగ్ షూట్ ని ప‌నిచేశారు. ఈ మ‌ద్య‌నే విడుద‌లయ్యి చార్ట్‌బ‌స్ట‌ర్ లో హిట్ నెంబ‌ర్ గా ప్రేక్ష‌కుల హ్రుద‌యాలు దొచుకుంటున్న ల‌వ‌ర్ ఆల్‌సో.. ఫైట‌ర్ ఆల్‌సో.. సాంగ్ ఇటీవ‌లే అమెరికా లో షూట్ చేయ‌టం జ‌రిగింది.
ఈ సాంగ్ ని ప్ర‌ముఖ డి.ఓ.పి జొసెఫ్ ల‌బిసి సినిమాటోగ్రాఫ‌ర్ గా త‌న విజువ‌ల్స్ ని అందించారు. జోసెఫ్ ల‌బిసి త‌న‌ కెరీర్ ని ప్రముఖ హాలీవుడ్ చిత్రాలు ద మూవీ హీరో, ది రీపెర్స్ తో మొదలు పెట్టినప్పటికీ ముఖ్యంగా ఈయన టాలెంట్ ని పాప్ అల్బమ్స్ షూట్ చేయడంలోనే ఎక్కువుగా ఉపయోగించారు. ప్రముఖ పాప్ సింగర్స్ అరియాణ గ్రాండే, ఎనరిక్యూ ఇగ్లిసియ్స్, నిక్కిమినాజ్ వంటి వారితో వర్క్ చేశారు. నిక్కిమినాజ్ అనకొండ ప్రపంచవ్యాప్తంగా ఎంతపాపులరో మనకు తెలిసిన విషయమే.
దాదాపు 40కి పైగా ఇంగ్లీష్ పాప్ అల్బమ్స్ కి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఇంత ఇంటర్నేషనల్ ప్రొఫైల్ ఉన్న జోసెఫ్ తొలిసారిగా నాపేరు సూర్య కి ప‌నిచేయ‌టం చాలా ఆనందంగా వుందంటున్నారు యూనిట్ స‌భ్యులు. ఈ సాంగ్ షూట్ కొసం దాదాపు 20 రోజులకి పైగా అమెరికాలోని హాలీవుడ్ ప్రాంతంలో ఈ పాటకొసం లొకేష‌న్స్ రీసెర్చ్ చేశారు.. ఈ పాట కోసం జోసెఫ్ అందించిన విజువల్స్ ప్రేక్షకుల ఆకట్టుకుంటాయి అంటున్నారు నిర్మ‌త ల‌గ‌డ‌పాటి శ్రీథ‌ర్ .
ఈసాంగ్ కి మ‌రో హై ప్రోఫైల్ టెక్నిషియ‌న్ వ‌ర్క్ చేశారు. ప్ర‌ముఖ కాస్ట్యూమ్ డిజైన‌ర్ ఆన్‌ మెరీ హూంగ్ (Ann marie hoang) ఈ సాంగ్ కి ప్ర‌త్యేఖంగా ప‌నిచేశారు. ప్రఖ్యాత హాలీవుడ్ పాప్ సింగర్స్ కి ఎందరికో కాష్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు యానమేరీ హొంగ్, ప్రప్రంచ ప్రఖ్యాత పాప్ క్వీన్ జెన్నీఫర్ లోపేజ్ కి కాష్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. అలానే ప్రస్తుతం నిక్కీ మినాజ్ తదితర సింగర్స్ కి కూడా కాష్ట్యూమ్స్ అందిస్తున్నారు యాన్. ఇలా ప్ర‌పంచంలో వున్న హై ప్రోఫైల్ టెక్నిషియ‌న్స్ తో ఈ సాంగ్ ని షూట్ చేయ‌టం చాలా ఆనందంగా వుంద‌న్నారు నిర్మాత .
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మా లు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లో సెన్సారు కార్య‌క్ర‌మాలు కూడా జ‌రుపుకొవ‌టానికి కూడా సిధ్ధమ‌వుతుంది.
ఈ నెల 22న గ్రాండ్ గా ఆడియో జ్యూక్ బాక్స్ ని రిలీజ్ చేస్తున్నారు. అలాగే మిల‌ట‌రి మాధ‌వ‌రం లో స్టైలిస్‌స్టార్ అల్లు అర్జున్ ఆద్వ‌ర్యంలో ఆడియో ఫంక్ష‌న్ చేస్తున్నారు.. అక్క‌డి మేజ‌ర్స్ ని వారి ఫ్యామిలిస్ ని క‌లిసి ముచ్చ‌టిస్తారు. ఏప్రిల్‌ 29 న ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు. మే 4 న సినిమా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here