స‌మంత జీవితంలో జెమినీ అత‌డేనా..?

SAMANTHA LIFE GEMINI GANESHAN SIDDHARTH
హాయిగా పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేస్తుంది స‌మంత‌. ఇలాంటి టైమ్ లో త‌న పాస్ట్ గురించి అంద‌రికీ చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ‌. సావిత్రి జీవితంలో ఉన్న‌ట్లే త‌న జీవితంలో కూడా ఒక జెమిని గ‌ణేషన్ ఉన్నాడ‌ని చెప్పి అంద‌రికీ షాకిచ్చింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం అక్కినేని కోడ‌లిగా ప్ర‌శాంతంగా ఉన్న స‌మంత‌.. దానికి ముందు ఒక‌రితో ప్రేమ‌లో ప‌డింది. ఆ హీరో ఎవ‌రో కాదు సిద్ధార్థ్. అప్ప‌ట్లో వీళ్ల మ‌ధ్య ప్రేమాయ‌ణం బాగానే న‌డిచింది.
ఇద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోవాల‌నుకున్నారు. కానీ చివ‌రి నిమిషంలో ఏదో తేడా జ‌రిగి ఇద్ద‌రూ విడిపోయారు. ఆ సంగ‌తి సిద్ధూ ఎప్పుడో మ‌రిచిపోయాడు కానీ స‌మంత మాత్రం ఇంకా గుర్తు పెట్టుకున్న‌ట్లుంది. అందుకే ఇప్పుడు స‌మయం వ‌చ్చింది కాబ‌ట్టి మ‌రోసారి త‌న గ‌తం గురించి చెప్పింది. త‌న లైఫ్ లో కూడా జెమిని ఉన్నాడ‌ని.. తాను కూడా సావిత్రిలా అయిపోయేదాన్ని అని కాక‌పోతే అదృష్టం బాగుండి తాను అలా కాలేద‌ని చెప్పింది ఈ భామ‌. పెళ్లికి ముందు త‌న గురించి త‌న‌కు పూర్తిగా తెలిసింది అని అందుకే దూర‌మ‌య్యాన‌ని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ‌.
త‌న లైఫ్ లో జ‌రిగిన అతి పెద్ద అద్భుతం నాగ‌చైత‌న్య‌తో ప‌రిచ‌యం అని.. త‌ను లైఫ్ లోకి రావ‌డం అదృష్టం అంటుంది స‌మంత‌. మొత్తానికి మ‌హాన‌టిలో న‌టించిన త‌ర్వాత త‌న లైఫ్ కూడా సేమ్ టూ సేమ్ ఉంద‌ని ఊహించుకున్నాన‌ని చెబుతుంది స‌మంత‌. పోనీలే.. అలా కాకుండా బ‌తికిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here