స‌మంత.. యు ట‌ర్న్ క‌న్ఫ‌ర్మ్..

Samantha U Turn
పెళ్లైన త‌ర్వాత హీరోయిన్ల‌లో మార్పు వ‌స్తుంది అంటే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు స‌మంత‌ను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. చైతూతో పెళ్లి త‌ర్వాత స‌మంత సినిమాల ఎంపిక‌లో చాలా మార్పు వ‌చ్చింది. గ్లామ‌ర్ షో చేస్తూనే.. మ‌రోవైపు గుర్తుండిపోయే పాత్ర‌ల కోసం చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఎలాగూ పెళ్లైన త‌ర్వాత గ్లామ‌ర్ పండించే హీరోయిన్ అవ‌కాశాలు రావ‌ని స‌మంత‌కు తెలుసు. అందుకే విభిన్న‌మైన పాత్ర‌ల వైపు వెళ్తుంది. అలా ఎంచుకున్న క‌థే యుట‌ర్న్ సినిమా. క‌న్న‌డ‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్టైన ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో రీమేక్ చేయాల‌ని భావించింది స‌మంత‌. స్వ‌యంగా నాగ‌చైత‌న్యే ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కూడా స‌మంత ఈ చిత్ర రీమేక్ లో న‌టిస్తుంద‌ని చెప్పాడు. కానీ ఏమైందో గానీ సినిమా విష‌యంలోనే ఆ మ‌ధ్య యుట‌ర్న్ తీసుకుంది స‌మంత‌.
ఈ రీమేక్ లో స‌మంత న‌టించ‌ట్లేదనే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు మ‌ళ్లీ యుట‌ర్న్ కు ట‌ర్న్ తీసుకుంది స‌మంత‌. ఒప్పుకున్న సినిమాలు పూర్తైన త‌ర్వ‌త త‌న‌కు బాగా ఇష్ట‌మైన‌ యు టర్న్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టనుంది.. 2016లో క‌న్న‌డ‌లో విడుద‌లైన ఈ చిత్రం అక్క‌డ మంచి విజ‌యం సాధించింది. ఎందుకో తెలియ‌దు కానీ ఈ క‌థ‌కు బాగా క‌నెక్ట్ అయింది స‌మంత‌. అప్ప‌ట్లో చైతూతో క‌లిసి బెంగ‌ళూర్ వెళ్లి ప్ర‌త్యేకంగా ఓ షో చూసి వ‌చ్చింది ఈ భామ‌. ఇక ఇప్పుడు యు ట‌ర్న్ క‌థ‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్లు రాయాల్సిందిగా ద‌ర్శ‌కున్ని కోరింది ఈ ముద్దుగుమ్మ‌. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలోపు యుట‌ర్న్ తెలుగులోనూ ప‌ట్టాలెక్క‌డం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here