స‌మ్మోహ‌నం నిజంగా స‌మ్మోహ‌న‌మే..


ఈ రోజుల్లో ఓ సినిమాపై అంచ‌నాలు పెరగాలంటే టైటిల్ కీల‌కం. అది బాగుంటే ఆటోమేటిక్ గా అంచ‌నాలు కూడా పెరిగిపోతాయి. ఇప్పుడు ఇంద్ర‌గంటి ఇదే చేస్తున్నాడు. తెలుగులో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుల్లో ఈయ‌న కూడా ఒక‌రు. ఈయ‌న‌కు మంచి పేరుంది.. హిట్లున్నా స్టార్స్ మాత్రం ఎందుకో ఈయ‌న‌తో ప‌నిచేయ‌రు. గ‌తేడాది ఈయ‌న చేసిన అమీతుమీ సూప‌ర్ హిట్ అయింది. దానికి ముందు నానితో చేసిన జెంటిల్ మ‌న్ కూడా హిట్టే.
ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం నాని మాత్ర‌మే ఈయ‌న‌తో సినిమా చేసిన పెద్ద స్టార్. అమీతుమీ త‌ర్వాత మ‌రోసారి చిన్న హీరోతోనే క‌మిటయ్యాడు ఇంద్రగంటి. సుధీర్ బాబుతో స‌మ్మోహ‌నం సినిమా చేస్తున్నాడు. శివలెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మాత‌. జెంటిల్ మ‌న్ త‌ర్వాత మ‌ళ్లీ ఈ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుంది. బాలీవుడ్ బ్యూటీ అదితిరావ్ హైద్రీ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుండ‌టం విశేషం. సినిమాలో కూడా సినిమా హీరోయిన్ గానే న‌టిస్తుంది అదితిరావ్.
ఈ సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. తాజాగా చిరంజీవి చేతుల మీదుగా టీజ‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత నిజంగానే మ‌నం చూస్తున్న‌ది ఇంద్ర‌గంటి సినిమానా.. లేదంటే మ‌ణిర‌త్నం సినిమానా అనిపించ‌క మాన‌దు. అంత రిచ్ గా పిజి విందా త‌న సినిమాటోగ్ర‌ఫీతో మాయ చేసాడు. మ‌రి చూడాలిక‌.. ఈ ఘ‌ట్ట‌మ‌నేని అల్లుడితో ఇంద్ర‌గంటి స‌మ్మోహ‌నం ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here