స‌మ్మోహ‌నం.. నిదాన‌మే ప్ర‌ధానం..!

ఇప్పుడు ఈ సినిమా చూసిన త‌ర్వాత ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్ ఇచ్చిన రివ్యూ ఇదే. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ కాబ‌ట్టి సినిమా ఎలా ఉంది అని అడ‌గాల్సిన ప‌నిలేదు. క‌చ్చితంగా ఈయ‌న సినిమా బాగానే ఉంటుంద‌నే న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల్లో ఉంది. అయితే అది క‌మ‌ర్షియ‌ల్ గా ఆడుతుందా ఆడ‌దా అనేది మాత్రం కావాలి. ఎందుకంటే కొన్నేళ్ల కింద ఈయ‌న సినిమాలు ప్ర‌శంస‌ల ద‌గ్గ‌రే ఆగిపోయేవి.

కానీ జెంటిల్ మ‌న్ త‌ర్వాత కూడా ఈయ‌న కూడా రూట్ మార్చేసాడు. ఇప్పుడు ఇంద్ర‌గంటి సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గానూ దుమ్ము దులిపేస్తున్నాయి. ఇదే కోవ‌లో స‌మ్మోహ‌నం కూడా ఉందా లేదా అనేది ఇప్పుడు అనుమానం. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్ర‌కారం సినిమా బాగుంది.. కానీ చాలా నెమ్మ‌దిగా సాగుతుంది. ఫ‌స్టాఫ్ కామెడీతో వెళ్లిపోయినా.. సెకండాఫ్ లో మాత్రం కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ మ‌రీ స్లో అయ్యాయ‌ని తెలుస్తుంది.

ఓవ‌ర్సీస్ టాక్ అయితే యావ‌రేజ్ గానే ఉంది. అయితే సినిమా క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌కు హార్డ్ హిట్టింగ్ అని చెబుతున్నారు ప్రేక్ష‌కులు. అంటే ఇండ‌స్ట్రీలో జ‌రిగే క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూను అదితిరావ్ పాత్ర‌తో చూపించాడు ద‌ర్శ‌కుడు. అది చాలా బాగా వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాడు ఇంద్ర‌గంటి. మొత్తానికి చూడాలి మ‌రి.. ఫ‌స్ట్ టాక్ అయితే యావ‌రేజ్ అని వ‌చ్చింది.. మ‌రి అది చివ‌రికి ఎక్క‌డ వ‌చ్చి ఆగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here