స‌ర్వ‌స్వం ధార‌పోస్తున్న అఖిల్..

Hello Hyd

ప్ర‌మోష‌న్ అంటే మ‌న హీరోల‌కు చిన్న విష‌యం. ఏదో రెండ్రోజులు అలా అంద‌రికీ పిలిచి ఇంట‌ర్వ్యూలు ఇచ్చేసి.. ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే అయిపోతుంది. కానీ బాలీవుడ్ లో అలా కాదు. వాళ్లు సినిమాకు నెల రోజుల ముందు నుంచే దేశాన్ని చుట్టేస్తుంటారు. ఇప్పుడు అఖిల్ కూడా ఇదే చేస్తున్నాడు. హ‌లో కోసం ఈయ‌న దేశాలు తిరిగేస్తున్నాడు. అంద‌రికీ హ‌లో చెప్పి వ‌స్తున్నాడు. త‌న సినిమా కోసం ప్రాణం పెట్టేస్తున్నాడు ఈ కుర్రాడు. నాలుగు రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. త‌క్కువ‌ టైమ్ ఉండ‌టంతో ప్ర‌మోష‌న్ల‌తోనే కాలం గ‌డిపేస్తున్నాడు సిసింద్రీ. ఎంత స‌్టార్ హీరో కొడుకైనా.. ఫ్లాపులొస్తే ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోరని అఖిల్ కు కూడా తెలుసు. ఇప్ప‌టికే యుఎస్ టూర్ ముగించుకుని వ‌చ్చిన అఖిల్.. ఇప్పుడు డిసెంబ‌ర్ 20న హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌బోయే ఈవెంట్ లోనూ డాన్సులు చేయబోతున్నాడు.
హైద‌రాబాద్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా చేస్తున్నారు. ఆడియో వైజాగ్ లో జ‌ర‌గ‌డంతో.. కావాల‌నే ప్రీ రిలీజ్ వేడుక‌ను హైద‌రాబాద్ లో చేస్తున్నాడు నిర్మాత నాగార్జున‌. అఖిల్ ఆశ‌ల‌న్నీ ఇప్పుడు హ‌లో సినిమాపైనే ఉన్నాయి. ఈయ‌న కెరీర్ ను ముంచినా.. తేల్చినా ఇప్పుడు  ‌హ‌లోనే. ఇది గానీ హిట్టైతే ఆటోమేటిక్ గా అఖిల్ స్టార్ అవుతాడు.. లేదంటే మాత్రం ఊహ‌కు కూడా అందదు ఆ న‌ష్టం. అఖిల్ మాత్రం హ‌లో సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డం ఖాయం అంటున్నాడు. ఈ న‌మ్మ‌కం నిల‌బెట్టుకోడానికి విక్ర‌మ్ కే కుమార్ కూడా మ్యాగ్జిమ‌మ్ ట్రై చేస్తున్నాడు. డిసెంబ‌ర్ 22న రానుంది హ‌లో. మొత్తానికి హ‌లో కోసం స‌ర్వ‌స్వం ధార‌పోస్తున్నాడు సిసింద్రీ. మ‌రి ఈయ‌న క‌ష్టానికి ఫ‌లితం ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here