హీరోల్లో ఎన్టీఆర్.. హీరోయిన్స్ లో శ్రీ‌దేవి.. 


ఓ హీరోయిన్ ఐదేళ్లు ఇండ‌స్ట్రీలో ఉండి నెంబ‌ర్ వ‌న్ అయితేనే ఆమెను ఆప‌డం క‌ష్టం. వాళ్లు చెప్పిన టైమ్ కు షూటింగ్ స్టార్ట్ చేసుకోవాలి.. ఎంత అడిగితే అంత ఇవ్వాలి.. వాళ్ల గొంతెమ్మ కోర్కెల‌న్నీ తీర్చాలి. కానీ శ్రీ‌దేవి ఒక‌ప్పుడు మూడు ద‌శాబ్ధాల పాటు ఇండ‌స్ట్రీని ఏలింది. స్టార్ హీరోల కంటే కూడా ఆమె క్రేజ్ ఎక్కువ అప్పుడు. అప్ప‌ట్లో ఆఖరి పోరాటం సినిమా చేస్తున్న‌పుడు నాగార్జున కంటే మూడింత‌ల పారితోషికం ఎక్కువ తీసుకుంది శ్రీ‌దేవి. ఇక జ‌గ‌దేక వీరుడు అతిలోక‌సుంద‌రికి చిరంజీవితో స‌మాన‌మైన రెమ్యున‌రేష‌న్ తీసుకుంది. అంత‌టి క్రేజ్ ఈ భామ సొంతం. మ‌రి ఇంత ఇమేజ్ ఉన్న శ్రీ‌దేవి సెట్ లో ఎలా ఉండేదో తెలుసా..? ఆమె పంచువాలిటీ చూసి అంతా షాక్ అయ్యేవాళ్లు.
టైమ్ అనే ప‌దానికి శ్రీ‌దేవి నిద‌ర్శ‌నం. క్ర‌మ‌శిక్ష‌ణ కూడా ఆమెను చూసి త‌నను తాను మార్చుకుంటుంది అంటారు ఆమెతో ప‌ని చేసిన వాళ్లు. ఒక్క‌సారి ఓ టైమ్ చెప్పిందంటే దానికి ప‌ది నిమిషాల ముందే సెట్ లో ఉండేది శ్రీదేవి. అది కూడా మేక‌ప్ వేసుకుని సిద్ధంగా ఉండేది. హీరోల్లో ఎన్టీఆర్ కు ఈ అల‌వాటు ఉండేది. ఆయ‌న కూడా ఓ టైమ్ చెబితే అర‌గంట ముందే మేక‌ప్ తో ఉండేవారు. అన్న‌గారికి ఉన్న అల‌వాటే శ్రీదేవికి ఉంది. సెట్ లో ఆమె చాలా సీరియ‌స్ గా ఉండేది. ఎవ‌రితోనూ పెద్ద‌గా జోకులు కూడా వేసేది కాదు. త‌న ప‌నేదో తాను చూసుకుని వెళ్లిపోవ‌డం శ్రీ‌దేవి త‌త్వం. ఇదే ఆమెను శిఖ‌రాగ్రాన నిలిపింది. చెప్పిన ప‌నిని మాత్రం ఏ రోజూ ప‌క్క‌న బెట్ట‌డం శ్రీ‌దేవి హిస్ట‌రీలోనే లేదు. అందుకే అన్నేళ్ళ పాటు ఒక్క చిన్న కంప్లైంట్ కూడా లేకుండా శ్రీదేవి టాప్ హీరోయిన్ గా ఇండియ‌న్ ఇండ‌స్ట్రీని ఏలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here