హీరోల‌ను తొక్కేస్తున్న దీపిక‌.. 

 Padmavat Release Date Confirmed
సినిమా ఇండ‌స్ట్రీ అంటేనే మేల్ డామినేటెడ్. ఇక్క‌డ హీరోల‌దే ఆధిప‌త్యం. వాళ్లే సినిమాను నిల‌బెట్టేది. వాళ్ల ఇమేజ్ తో సినిమాను న‌డిపిస్తుంటారు. ఇక్క‌డ హీరోల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ‌టం అంటే హీరోయిన్ల‌కు చిన్న విష‌యం కాదు. వాళ్ల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ‌ట‌మే అద్భుతం అనుకుంటే.. వాళ్ల‌నే డామినేట్ చేస్తే ఇక చ‌రిత్రే. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అది జ‌ర‌గ‌డం క‌ష్టం. కానీ దీపిక ప‌దుకొనే మాత్రం అది చేస్తుంది. త‌న క్రేజ్ తో హీరోల‌కు షాక్ ఇస్తుంది ఈ క‌న్న‌డ క‌స్తూరి. వ‌ర‌స విజ‌యాల‌తో బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ మ‌ధ్య హాలీవుడ్ కు కూడా వెళ్లింది దీపిక‌. అక్క‌డే ట్రిపుల్ ఎక్స్ సినిమా చేసింది. కానీ అది  పెద్ద‌గా ఆడ‌లేదు. అయినా కానీ బాలీవుడ్ ద‌ర్శ‌కులు మాత్రం దీపిక‌కు అవ‌కాశాలు పిలిచి మ‌రీ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ భామ ప‌ద్మావ‌తి సినిమాతో వ‌చ్చింది. ఇందులో రాణి ప‌ద్మావ‌తిగా న‌ట విశ్వ‌రూపం చూపించింది దీపిక‌. ప‌ద్మావ‌తి ఎలా ఉంటుందో ఇప్ప‌టి వాళ్ల‌కు ఎవ‌రికీ తెలియ‌దు. కానీ ఉంటే మాత్రం క‌చ్చితంగా దీపిక మాదిరే ఉంటుందేమో..? అంత‌గా చూపించాడు భ‌న్సాలీ ఈ పాత్ర‌ను. ఇక ఇదే సినిమాలో న‌టించిన ర‌ణ్ వీర్ సింగ్, షాహిద్ క‌పూర్ కంటే కూడా ఎక్కువ రెమ్యున‌రేష‌న్ దీపిక‌కే వెళ్లింది. వాళ్ల‌కు 10 కోట్లు అందితే.. దీపిక‌కు 13 కోట్లు ఇచ్చారు నిర్మాత‌లు. టైటిల్ రోల్ చేస్తుంది పైగా క్రేజ్ లో కూడా వాళ్ళ‌తో పోలిస్తే దీపిక‌కు ఎక్కువ‌గా రేంజ్ ఉంది అందుకే రెమ్యున‌రేష‌న్ ఎక్కువిచ్చారు. ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే.. అప్పుడ‌ప్పుడూ ఫోటోషూట్ల‌తో కుర్రాళ్ల నిద్ర చెడ‌గొడుతుంది ఈ క‌న్న‌డ క‌స్తూరి. మొత్తానికి హీరోయిన్ అంటే బుట్ట‌బొమ్మ‌లా చూస్తున్న ఇండ‌స్ట్రీకి.. దీపిక లాంటి వాళ్లు షాకిస్తూనే ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here