హీరో కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా "బంగారి బాలరాజు" మొదటి పాట విడుదల


నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “బంగారి బాలరాజు”.
ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.
ఈ చిత్రం ఆడియోలోని మొదటి పాటను హీరో కళ్యాణ్ రామ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… బంగారి బాలరాజు సినిమా ఆడియోలోని మొదటిపాటను నా చేతుల మీదుగా విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించి ఈ బ్యానర్ మీద మరెన్నో సినిమాలు రావాలని, అలాగే హీరో రాఘవ్, హీరోయిన్ కారుణ్య లకు మరియు దర్శకుడు కోటేంద్ర, నిర్మాతలు రఫి, రాఘవేంద్ర రెడ్డి లకు బంగారి బాలరాజు మంచిపేరు తీసుకురావాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను. అని బెస్ట్ విషెస్ అందించారు.
ఈ సందర్భంగా చిత్ర హీరో రాఘవ్ మాట్లాడుతూ… నా మొదటి సినిమా బంగారి బాలరాజు లోని మొదటి పాటను హీరో కళ్యాణ్ రామ్ గారు విడుదల చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారికి నా తరుపున, మా యూనిట్ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అని తెలిపారు.
ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ.. దర్శకుడిగా పరిచయం అవుతున్న నా మొదటి సినిమా “బంగారి బాలరాజు ఆడియోలోని మొదటి పాటను కళ్యాణ్ రామ్ గారు విడుదల చేయడం చాలా సంతోషం ఉంది. కళ్యాణ్ రామ్ గారు మా సినిమాకు సపోర్ట్ ఇవ్వడం మా యూనిట్ లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సందర్బంగా వారికి యూనిట్ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు” అని తెలిపారు. అలాగే బంగారి బాలరాజు మూవీ గురించి వివరాలు తెలియజేస్తూ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో సినిమా విడుదల తేదిని తెలియజేస్తాము. అని తెలిపారు.
ఈ సందర్భం గా ప్రొడ్యూసర్స్ లో ఒకరైన రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ… “బంగారి బాలరాజు సినిమా లోని పాటను కళ్యాణ్ రామ్ గారు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉన్నాయి. మొదటి పాటను కళ్యాణ్ రామ్ గారు విడుదల చేయగా, మిగిలిన పాటలను ప్రముఖ సెలబ్రిటీలతో రిలీజ్ చేస్తాము. అలాగే సినిమా బాగా వచ్చిందని త్వరలోనే సినిమా విడుదల తేదీని తెలియజేస్తామని తెలిపారు.
టెక్నిషియన్స్
కెమెరా : చక్రవర్తి
ఆర్ట్ డైరెక్టర్ : కృష్ణమాయ
ఎడిటింగ్ : నందమూరి హరి
సంగీతం : చిన్నికృష్ణ – చిట్టిబాబు రెడ్డిపోగు
పాటలు : చిలకరెక్క గణేష్
ఫైట్స్ : రామ్ సుంకర
పి.అర్.ఓ : కడలి రాంబాబు. KNS (కడలి మీడియా)
నిర్మాతలు : కె.యండి. రఫీ, రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి
కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం :
కోటేంద్ర దుద్యాల
 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here