హ‌లో ఆడియోలో అన్నీ అద్భుతాలే..

Nagarjuna Hello Movie Press Meet (4)

అఖిల్ రెండో సినిమా హ‌లో ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. డిసెంబ‌ర్ 22 ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ తో పాటు ప్ర‌మోష‌న్ లోనూ వేగం పెంచేస్తున్నాడు నిర్మాత నాగార్జున‌. వ‌ర్మ‌తో తాను క‌మిటైన సినిమాను కూడా ప‌క్క‌న‌బెట్టి కొడుకు సినిమాపై దృష్టి పెట్టాడు నాగార్జున‌. ఈ చిత్ర ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం డిసెంబ‌ర్ 10న జ‌ర‌గ‌నుంది. అది కూడా ఎప్ప‌ట్లా హైద‌రాబాద్ లో కాదు.. విశాఖ‌ప‌ట్నంలో. అక్క‌డ ఇప్ప‌టికే హలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ విష‌యంపై నాగార్జున కూడా క్లారిటీ ఇచ్చాడు. వైజాగ్ త‌ర్వాత హైద‌రాబాద్ లోనే హ‌లో ఈవెంట్ ఒక‌టి ప్లాన్ చేస్తున్నారు. ఇక్క‌డా అక్క‌డా అభిమానుల‌ను ఉత్సాహ‌ప‌రిచేలా హ‌లో ఈవెంట్ ఉంటుంద‌ని క్లారిటీ ఇచ్చాడు మ‌న్మ‌థుడు.
హలో సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. విక్రమ్ కే కుమార్.. అనూప్ కాంబినేషన్ లో ఇదివ‌ర‌కు వ‌చ్చిన మ‌నం సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో పాట‌ల‌తో పాటు ఆర్ఆర్ కూడా బ్లాక్ బ‌స్ట‌రే. ఇప్పుడు హ‌లోకు కూడా అదే స్థాయిలో అనూప్ మ్యాజిక్ చేస్తాడ‌ని న‌మ్ముతున్నాడు నాగార్జున‌. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో అఖిల్ ఓ పాట పాడాడు. ఆ మ‌ధ్య ఓ ఈవెంట్ లో ఈ పాట‌ను స్వ‌యంగా స్టేజ్ పై పాడాడు అఖిల్. ఇక ఇప్పుడు విశాఖ‌లో జ‌ర‌గ‌బోయే ఆడియో వేడుక‌లోనూ వేదిక‌పై ఈ పాట పాడ‌బోతున్నాడు అఖిల్. ఆ రోజు జ‌రిగే కార్య‌క్ర‌మానికి ఇదే హైలైట్ అవుతుందంటున్నారు నాగార్జున‌. రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా హ‌లో ఉండ‌బోతుంది. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. హ‌లోతో అఖిల్ ర‌చ్చ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here