​​సిరిమల్లె పువ్వా చిత్రం ప్రారంభం..

ఎస్. ఎమ్. క్రియేషన్స్ పతాకంపై మమత, నరేంద్ర, షఫీ, ప్రియ ప్రధాన పాత్రధారులుగా గౌతమ్. ఎమ్ దర్శకత్వంలో లేడీ నిర్మాత కౌసర్ జహాన్ నిర్మిస్తున్న మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం ‘సిరిమల్లె పువ్వా’. ఈ చిత్రం ప్రారంభోత్సవం నేడు తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ చేతులమీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వెనుక బడిన తరగతుల కమీషన్ అధ్యక్షులు డాక్టర్ వకుళా భరణం కృష్ణ మోహనరావు, సుధాకర్ గోగికర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ.. “ఇదొక వెరైటీ చిత్రం. ఈ చిత్రంలో మంచి మెసేజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా మంచి కథ, కథనంతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాం. పేరుకు తగినట్లుగానే.. సిరిమల్లె పువ్వంత స్వచ్ఛంగా ఈ సినిమా ఉంటుంది..” అన్నారు.
నిర్మాత కౌసర్ జహాన్ మాట్లాడుతూ.. ” గౌతమ్ గారు చెప్పిన కథ ఎంతగానో నచ్చింది. మంచి మెసేజ్ వుంది. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ వున్నాయి. ఈ చిత్రం ఖచ్చితంగా మా బ్యానర్ కి మంచి పేరు తెచ్చే చిత్రం అవుతుంది..” అన్నారు.

మమత, నరేంద్ర, షఫీ, ప్రియ, జి. పుల్లారావు, దీప్తి, వీరు, కుమార్, గౌతమ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి డి.ఓ.పి: సూర్య, ప్రభాకర్, ఫిరోజ్, ఎడిటర్: నందమూరి హరి, మ్యూజిక్: రామ్ మోహన్, ఆర్ట్ డైరెక్టర్: వాసుదేవరావు, ప్రొడక్షన్ మేనేజర్: లక్ష్మణ్, ప్రొడ్యూసర్: శ్రీమతి కౌసర్ జహాన్, కథ-దర్శకత్వం: గౌతమ్. ఎమ్. ​​​​

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here