2.0 మ‌ళ్లీ ఇచ్చారుగా హ్యాండ్.. 

    
ర‌జినీకాంత్ సినిమా అంటేనే చెప్పిన టైమ్ కు వ‌స్తుందా రాదా అనే టెన్ష‌న్. ఇక ఆయ‌న‌కు తోడుగా శంక‌ర్ కూడా ఉన్నాడు. అంటే క‌చ్చితంగా చెప్పిన టైమ్ కు రాద‌ని క‌న్ఫ‌ర్మేష‌న్ అన్న‌మాట‌. ఇప్ప‌టికే విడుద‌ల తేదీ విష‌యంలో చాలా సార్లు డేట్లు మార్చారు. ఇలాంటి వాళ్ల‌కు టీజ‌ర్ రిలీజ్ డేట్ ఓ లెక్క‌. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఈ చిత్ర టీజ‌ర్ ఎవ‌రూ అడ‌క్క‌ముందే జ‌న‌వ‌రి 6 సాయంత్రం విడుద‌ల అవుతుంద‌ని చెప్పారు. అరే.. తొలిసారి 2.0 యూనిట్ అభిమానుల మ‌న‌సు అర్థం చేసుకున్నారే అనుకున్నారు. కానీ ఆనందించినంత సేపు ప‌ట్ట‌లేదు హ్యాండివ్వ‌డానికి. కొట్టి మ‌రీ ఆయింట్ మెంట్ రాయ‌డం అంటే ఇదే. జ‌న‌వ‌రి 6న టీజ‌ర్ వ‌స్తుంది వ‌స్తుంది అని ఆశ‌పెట్టి చివరికి హ్యాండిచ్చేసారు 2.0 యూనిట్. కొన్ని టెక్నిక‌ల్ కార‌ణాల‌తో టీజ‌ర్ విడుద‌ల సాధ్యం కావ‌ట్లేద‌ని సారీ చెప్పారు యూనిట్.
టీజ‌ర్.. ట్రైల‌ర్ ఎప్పుడు విడుద‌ల‌వుతుందో త్వ‌ర‌లోనే చెబుతామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతానికైతే టీజ‌ర్ రాద‌ని ఖ‌రాకండిగా తేల్చేసారు. ఇదివ‌ర‌కు సినిమా కూడా ఇలాగే పోస్ట్ పోన్ చేస్తూ వ‌చ్చారు. జ‌న‌వ‌రిలోనే రావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు ఎప్రిల్ 14కి వాయిదా ప‌డింది. విజువల్‌ ఎఫెక్ట్స్ కార‌ణంగానే వాయిదా పడిందంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్ర విజువ‌ల్ ఎఫెక్ట్స్ టీం మేనేజ‌ర్ శ్రీనివాస్‌ మోహన్‌ పర్యవేక్షణలో ప్ర‌పంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు ఈ చిత్ర విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం పని చేస్తున్నాయి. బాహుబ‌లి తొలి భాగానికి ప‌నిచేసింది ఈయ‌నే. ఇక ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా 2.0 రికార్డు సృష్టించబోతోంది. 450 కోట్ల‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు లైకా ప్రొడ‌క్ష‌న్స్. రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌, అమీ జాక్సన్‌, అదిల్‌ హుస్సేన్‌, కళాభవన్‌ షాజోన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here