సావిత్రి మ‌ళ్లీ వ‌చ్చింది..


నో డౌట్.. ఇప్పుడు కీర్తిసురేష్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. మ‌న‌షుల్ని పోలిన మ‌నుషులు ఉంటారంటారు. అది బ‌య‌ట ఉంటుందో లేదో తెలియ‌దు కానీ సినిమాల్లో మాత్రం జ‌రుగుతుంది. ఇప్పుడు సావిత్రి పాత్ర కోసం కీర్తినే పూర్తిగా సావిత్రిలా మార్చేసారు. ఆ మ‌హాన‌టిని ఈ త‌రంలో ఎవ‌రూ చూడ‌లేదు. కానీ ఇప్పుడు కీర్తిసురేష్ ను చూస్తుంటే అచ్చంగా అప్పుడు సావిత్రి ఎలా ఉండేదో అర్థ‌మైపోతుంది. మ‌హాన‌టి సినిమా కోసం త‌న‌ను తాను అంత‌గా మార్చేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా విడుద‌లైన స్టిల్స్ చూస్తుంటే అచ్చంగా సావిత్రి గారే అలా గ్లాసెస్ పెట్టుకుని న‌డుచుకుంటూ వ‌స్తున్నారా అనిపిస్తుంది. అంత‌గా ఆ పాత్ర‌లో లీన‌మైపోయింది కీర్తిసురేష్. నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో స‌మంత, దుల్క‌ర్ స‌ల్మాన్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మే 9న విడుద‌ల కానుంది మహాన‌టి. మొద‌ట్లో సినిమాపై ఆస‌క్తి కాస్త త‌క్కువ‌గానే ఉండేది కానీ ఒక్కో పాత్ర తెలుస్తున్న కొద్దీ.. ఒక్కో లుక్ బ‌య‌టికి వ‌స్తున్న కొద్ది సినిమాపై అంచ‌నాలు తారాస్థాయికి చేరిపోతున్నాయి. ఇప్పుడు అయితే మ‌హాన‌టి సంచ‌ల‌నం సృష్టించేలా క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here