పేట క‌లెక్ష‌న్స్ సంగతేంటి.. ర‌జినీ కోరుకున్న హిట్టొచ్చిన‌ట్లేనా..? 

ర‌జినీకాంత్ కు కొన్నేళ్లుగా విజ‌యం లేదు. నిజం ఒప్పుకోడానికి క‌ష్టంగానే అనిపిస్తుంది కానీ ఈయ‌న గ‌త సినిమా 2.0 కూడా అనుకున్న అంచ‌నాలు అందుకోలేదు. 900 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింద‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్నారు కానీ సినిమాను అమ్మింది 1200 కోట్ల‌కు.
rajinikanth petta teaser

 

అది దాచేసి వ‌చ్చింది మాత్రం చెబుతున్నారు నిర్మాత‌లు. దాంతో అభిమానులు కూడా ర‌జినీకాంత్ హిట్ కొట్టేసాడ‌నే సంబ‌రాలు చేసుకుంటున్నారు. కానీ ఈయ‌న కోరుకున్న విజ‌యం మాత్రం ఇంకా రాలేదు. 2.0 వ‌చ్చిన మూడు నెల‌ల్లోనే మ‌రో సినిమాతో వ‌చ్చాడు ర‌జినీ. ఈయ‌న న‌టించిన పేట పొంగ‌ల్ కానుక‌గా విడుద‌లైంది. కార్తిక్ సుబ్బ‌రాజ్ తెర‌కెక్కించిన ఈ చిత్రానికి త‌మిళ‌నాట మంచి క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి.

మూడు రోజుల్లోనే 50 కోట్ల మార్క్ అందుకుంది పేట‌. అయితే ఈ చిత్రానికి తెలుగులో మాత్రం ఊహించిన క‌లెక్ష‌న్లు రావ‌డం లేదు. ఇక్క‌డ స‌రైన థియేట‌ర్స్ దొర‌క్క‌పోవ‌డం.. భారీ సినిమాలు కూడా రావ‌డంతో పేట‌కు అంత క‌లెక్ష‌న్లు రావ‌డం లేదు. కానీ త‌మిళ‌నాట మాత్రం దుమ్ము దులిపేస్తుంది పేట‌. త‌మిళ‌నాట మూడు రోజుల్లోనే 24కోట్లు వ‌సూలు చేసిన పేట‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా 50 కోట్ల‌కు చేరువైంది. ఈ చిత్రంతో చాలా రోజులుగా ర‌జినీ కోరుకుంటున్న క‌మ‌ర్షియ‌ల్ హిట్ వ‌చ్చిన‌ట్లే క‌నిపిస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్ర ప్ర‌యాణం ఎక్క‌డ ఆగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here