సంచలనం రేపుతున్న తెలుగు సీరియల్ నటి ఆత్మహత్య..

ఇండస్ట్రీలో ఉన్న వాళ్లను ఏదో అనుకుంటారు.. కానీ ఇక్కడ ఉన్న వాళ్లకు ధైర్యం చాలా తక్కువ. బయటి వాళ్లకు కష్టాలు వస్తే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచిస్తారు.. కానీ ఇండస్ట్రీలో అమ్మాయిలు మాత్రం చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ళ కష్టాలు వస్తే ముందుగా ఆలోచించేది.. గుర్తుకు వచ్చేది ఆత్మహత్య. ఇప్పుడు మరో తార కూడా ఇలాగే రాలిపోయింది. తెలుగు టీవీ సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. పవిత్ర బంధంతో పాటు మరికొన్ని సీరియల్స్ లో నటించిన ఈమె కొంతకాలంగా నటనకు దూరంగా ఉంది.

tv actress jhansi commits suicide

ఆరు నెలలుగా సూర్య అనే యువకుడితో ప్రేమలో ఉంది ఝాన్సీ. ఇద్దరూ కలిసి సహజీవనం కూడా చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక ఇల్లు తీసుకొని అందులోనే ఉన్నారని తెలుస్తోంది. అప్పుడప్పుడు సొంత వాళ్లను కూడా కలవడానికి వస్తుంటుంది ఝాన్సీ. అయితే అంతా బాగానే ఉన్నా పెళ్లి విషయానికి వచ్చేసరికి సూర్య ప్రవర్తన భిన్నంగా ఉండటంతో మనస్తాపానికి గురైంది. దానికి తోడు అవకాశాలు తగ్గిపోవడంతో మరింత డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ తట్టుకోలేక ఉరి వేసుకొని ఉసురు తీసుకుంది ఝాన్సీ. ఆమె సోదరుడు వచ్చి తలుపు ఎంత బాదినా తీయకపోవడంతో బద్దలు కొట్టి లోపలికి వెళ్లే సరికి విగతజీవిగా పడి ఉంది ఝాన్సీ. ప్రస్తుతం ఆమె ప్రియుడు సూర్య పరారీలో ఉన్నాడు. మొత్తానికి ఏదేమైనా కూడా మరో నటి జీవితం విషాదాంతంగా ముగిసిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here