మిస్ట‌ర్ మ‌జ్ను ప్రివ్యూ.. అఖిల్ ఏం చేయ‌బోతున్నాడు..?

ఇండస్ట్రీకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న కూడా ఇప్పటివరకు ఒక్క విజయం కూడా అందుకోలేకపోయాడు అక్కినేని అఖిల్. 2015లో అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ హీరో ఇప్పటివరకు కేవలం రెండు సినిమాలు మాత్రమే చేశాడు. తొలి సినిమా ఇచ్చిన షాక్ నుంచి కోలుకుని తర్వాత ప్రేక్షకులకు హలో చెప్పాడు అఖిల్. విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం కూడా నిరాశపరచడంతో మరో ఏడాది గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన మిస్టర్ మజ్ను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ హీరో. జనవరి 25 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

దాంతో ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో అనే టెన్షన్ ఇప్పటినుంచే అఖిల్ లో కనిపిస్తుంది. ఇది ఈయన కెరీర్ కు కీలకంగా మారింది. ఈ సినిమాతో హిట్టు కొట్టి తాను కూడా రేస్ లోనే ఉన్నాను అంటూ గుర్తు చేయాలని చూస్తున్నాడు అఖిల్. అక్కినేని కుటుంబంలో కచ్చితంగా మాస్ హీరో అయ్యే లక్షణాలు ఒక్క అఖిల్ కే ఉన్నాయని అభిమానులు ముందు నుంచి భావిస్తున్నారు. కానీ అది ప్రతిసారి బెడిసికొడుతూనే ఉంది.

దాంతో ఈ సారి పూర్తిగా ప్రేమకథాచిత్రం చేశాడు అక్కినేని వారసుడు. వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా నడిపించాడ‌ని తెలుస్తోంది. ఆరెంజ్ సినిమా ఛాయలు కనిపిస్తున్నాయి ఈ సినిమాలో. అయినా కూడా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని ధీమాతోనే ఉన్నాడు వెంకీ అట్లూరి. మరి ఈయన నమ్మకం మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా ఎంత వరకు నిజం చేస్తుందో చూడాలిక‌.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here