బ్యాగ్ వేసుకొని బయలుదేరిన అల్లు వారబ్బాయి..

మెగా కుటుంబం నుంచి ఇప్పటికే దాదాపు అరడజను మంది హీరోలు వచ్చారు. అందరూ బాగానే సక్సెస్ అయ్యారు.. ఒక్క అల్లు శిరీష్ తప్ప. ఇప్పుడు ఈయన కూడా ఒక్క హిట్టు కొట్టాలని ఆశిస్తున్నాడు. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు కమర్షియల్ గా ఓకే అనిపించినా కూడా అల్లు శిరీష్ కు గుర్తింపు మాత్రం రాలేదు. ప్రస్తుతం ఈయన ఏబిసిడి సినిమాలో నటిస్తున్నాడు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.
ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అని ధీమాగా చెబుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది. సంక్రాంతి సందర్భంగా సినిమా లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఫిబ్రవరి 18న సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా ఇప్పుడు మార్చి 1కి దీనిని వాయిదా వేశారు. బ్యాగ్ వేసుకొని హెడ్ ఫోన్స్ పట్టుకొని చాలా స్టైలిష్ గా ఉన్నాడు అల్లు శిరీష్. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఏబిసిడి సినిమా తెలుగు ప్రేక్షకులని కచ్చితంగా అలరిస్తుందని ధీమాగా ఉన్నాడు అల్లు శిరీష్. కృష్ణార్జున యుద్ధంలో నానితో జోడీ కట్టిన రుక్సర్ మీర్ ఈ చిత్రంలో శిరీష్ తో రొమాన్స్ చేస్తోంది. సంజీవ్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మరి అల్లు శిరీష్ నమ్మకాన్ని ఈ చిత్రం ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here