ఆ సినిమాలో రవితేజ ఉంటే ఇంక రచ్చ రచ్చే..

రవితేజ అంటేనే ఎనర్జీ. ఆయన సినిమాల్లో ఉండే జోష్ అలాగే ఉంటుంది. ఈ మధ్య కాస్త జోరు తగ్గింది కానీ ఒకప్పుడు రవితేజ సినిమా అంటే ఎనర్జీ డ్రింక్ తాగినట్లు ఉండేది. సినిమా చూస్తున్నంత సేపు ఫుల్ మాస్ యాక్షన్ తో దుమ్ము రేపేవాడు మాస్ రాజా.కొంతకాలంగా ఆయనలో ఉన్న ఎనర్జీని ప్రేక్షకులు చూడలేకపోతున్నారు. దానికి కారణం వరుస ఫ్లాపులే. దాంతో ఇప్పుడు మరోసారి తనకు హిట్ ఇచ్చిన దర్శకుడుతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు రవితేజ.

raviteja amar akbar antony pre-release review

రెండేళ్ల కింద రవితేజతో రాజా ది గ్రేట్ లాంటి సినిమా చేసిన అనిల్ రావిపూడి మరోసారి మాస్ రాజాతో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సారి ఏకంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ లో రవితేజ నటించబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర రికార్డు వసూళ్లు సాధిస్తున్న ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్3లో రవితేజ నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇందులో ఆల్రెడీ వెంకటేష్, వరుణ్ తేజ్ ఉంటారు. వాళ్లకు తోడుగా ఇప్పుడు రవితేజ కూడా వస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే గాని నిజమై ఎఫ్ 3 లో రవితేజ కూడా ఉంటే ఇక రచ్చ తట్టుకోవడం ఎవరివల్లా కాదు. ఒకేసారి ముగ్గురు స్క్రీన్ పై కనిపిస్తే అభిమానులు కూడా పండగ చేసుకోవడం ఖాయం. ప్రస్తుతం దీని కోసమే కథ సిద్ధం చేస్తున్నాడు అనిల్ రావిపూడి. అన్ని అనుకున్నట్లు జరిగి ఎఫ్ 3లో రవితేజ కూడా జాయిన్ అయితే కచ్చితంగా ఈ సినిమా చరిత్ర సృష్టించడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here