చిరంజీవి-కొర‌టాల శివ‌.. మ‌రో కొత్త క‌థ

ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఎవ‌రి జాతకం ఎలా మారుతుందో చెప్ప‌డం క‌ష్టం. అదేదో సినిమాలో ఆహుతి ప్ర‌సాద్ చెప్పిన‌ట్లు నిన్న రైట్ అనుకున్న‌ది.. రేపు రాంగ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ఆ మ‌ధ్య సైరా త‌ర్వాత చిరంజీవి త‌ర్వాతి సినిమా ఏంటి అంటే బోయ‌పాటితోనే క‌దా అన్నారు. కానీ సీన్ లోకి స‌డ‌న్ గా కొర‌టాల శివ వ‌చ్చాడు. ఈయ‌న ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. చేసిన నాలుగు సినిమాలు కూడా బాగానే ఆడాయి. భ‌ర‌త్ అనే నేను కాస్త అటూ ఇటూ అయినా.. క‌లెక్ష‌న్లు మాత్రం 90 కోట్ల‌కు పైగానే వ‌చ్చాయి. దాంతో ఇది కూడా అబౌ యావ‌రేజ్ కిందే లెక్క‌. అంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్లాప్ లేని ప్ర‌యాణం అన్న‌మాట‌. పైగా సందేశాత్మ‌క క‌థ‌ల‌ను బాగా చెప్తాడ‌నే పేరుంది. క‌మ‌ర్షియ‌ల్ హంగులు అద్ది.. మెసేజ్ లు ఇవ్వ‌డంలో బాగా ఆరితేరిపోయాడు కొర‌టాల శివ‌. ఈ మ‌ధ్యే ఈయ‌న చిరంజీవిని క‌లిసాడు.. ఓ క‌థ కూడా చెప్పాడు. ఆ క‌థ చిరుకు న‌చ్చ‌లేద‌ని.. మ‌రో కొత్త క‌థ సిద్ధం చేయాల్సిందిగా కోరాడ‌ని వ‌చ్చిన వార్త‌ల‌ను చిత్ర‌యూనిట్ కొట్టి పారేసింది.

Kortala Siva Tie up with Chiranjeevi

దానికి మెగాస్టార్ కూడా ఓకే అన్నాడు. ప్ర‌స్తుతం బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసే ప‌నిలో ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఠాగూర్ త‌ర‌హాలోనే ఇది కూడా ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. అందులో లంచం గురించి చెబితే ఇందులో నిరుద్యోగం గురించి చెప్ప‌బోతున్నాడు చిరంజీవి. కొర‌టాల కూడా ఈ క‌థ‌ను ప‌క్కాగా సిద్ధం చేస్తున్నాడు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఎప్రిల్ లోపు సైరా టాకీ పూర్తి చేయాల‌ని సురేంద‌ర్ రెడ్డిని కోరుతున్నాడు చిరంజీవి. అన్నీ కుదిర్తే వ‌చ్చే ఏడాది మే నుంచి చిరు-కొర‌టాల సినిమా ప‌ట్టాలెక్కడం ఖాయంగా క‌నిపిస్తుంది. అయితే కొర‌టాల సీన్ లోకి వ‌స్తే మ‌రి బోయ‌పాటి ఏమైపోయిన‌ట్లు..? ప‌్ర‌స్తుతం ఈయ‌నకు బాల‌య్య‌తో సినిమా క‌మిట్మెంట్ ఉంది. అది పూర్త‌య్యాకే చిరంజీవితో సినిమా ఉండ‌బోతుంది. మ‌రోవైపు ఈ చిత్రం ఠాగూర్ త‌ర‌హాలో ఉంటుంద‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here