వ‌ర్మ‌తో త్రిష చిలిపి ప‌నులు.. బుగ్గ గిల్లిందంట తెలుసా..?

త్రిష పైకి చూడటానికి చాలా సీరియస్ గా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం చాలా ఫ‌న్నీ. ఆమె చేసే కామెడీ చూస్తే కడుపు చెక్కలైపోతుంది. అంత నవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు ఈమె గురించి మరో విషయం బయటకు వచ్చింది. ఇది తెలిస్తే నవ్వు ఆపుకోలేరు కూడా. ఇంతకీ అంత కొంటె ప‌ని ఏం చేసింది అనుకుంటున్నారా.. ఈమె వర్మ బుగ్గ గిల్లింది.. నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా కూడా ఇది నిజం. ఈ విషయం చెప్పింది కూడా స్వయంగా వర్మే. అయితే వర్మ అంటే రామ్ గోపాల్ వర్మ కాదు. తమిళ ఇండస్ట్రీ వర్మ.. అతడే విక్రమ్ తనయుడు ధ్రువ్. ఈయన ప్రస్తుతం అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ లో నటిస్తున్నాడు.

ఈ సినిమాకు వర్మ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్ర ప్ర‌మోష‌న్ లో భాగంగానే త్రిష గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌పెట్టాడు ధృవ్. కొన్నేళ్ల కింద త‌న‌ను కలిసినప్పుడు చాలా క్యూట్ గా ఉన్నావు అంటూ త్రిష బుగ్గ గిల్లిన సంగతి గుర్తు చేసుకున్నారు ఈ కుర్రహీరో. త్రిష అంటే తనకు చాలా ఇష్టమని చిన్నప్పటినుంచి ఆమె తన ఫేవరెట్ హీరోయిన్ అంటున్నాడు ధృవ్. ఈ సంఘటన జరిగి దాదాపు 15 ఏళ్లు అయిపోయింది. అప్పట్లో విక్రమ్ హీరోగా వచ్చిన సామీ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. అప్పటికి ధృవ్ వ‌య‌సు కేవలం 7 ఏళ్లే. అప్పుడే ఆ కుర్రాడి బుగ్గ గిల్లింది త్రిష. ఇప్పుడు ఇది గుర్తు చేసుకుని న‌వ్వుకుంటున్నాడు ధృవ్ విక్ర‌మ్

Dhruv Shares Magical Moments With Trisha
Dhruv Shares Magical Moments With Trisha

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here