అనిల్ రావిపూడి ని కట్టడి చేయడానికి చూస్తున్న దిల్ రాజు..

వరస విజయాలు ఇస్తున్న దర్శకుడు అంటే ఏ నిర్మాతకైనా మోజే. ఆయన్ని వదిలి పెట్టడానికి ఎవరికీ మనసు రాదు. ఇప్పుడు దిల్ రాజు కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన బ్యానర్లో వరుసగా హ్యాట్రిక్ విజయాలు ఇచ్చిన అనిల్ రావిపూడిని బయటకు పంపించడానికి రాజుగారికి మనసు రావడం లేదు. అయితే అనిల్ రావిపూడి ఈ నిర్మాతతో కుదుర్చుకున్న మూడు సినిమాల డీల్ పూర్తయిపోయింది. సుప్రీమ్, రాజా ది గ్రేట్, f2 సినిమాలు దిల్ రాజు సంస్థలోనే చేశాడు అనిల్ రావిపూడి. ఇక ఇప్పుడు నాలుగో సినిమా కూడా తన సంస్థలోనే చేయాలంటూ దిల్ రాజు దర్శకుడు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకే నిర్మాతతో ఎన్ని సినిమాలు చేస్తే మిగిలిన వాళ్లకు ఎక్కడ దూరమైపోతానో అనే ఒక చిన్న టెన్షన్ అనిల్ రావిపూడిలో కనిపిస్తుందని చెబుతున్నారు సన్నిహితులు.

కానీ దిల్ రాజు మాత్రం అలాంటిదేమీ లేకుండా అనిల్ రావిపూడిని సిద్ధం చేస్తున్నాడు. మరోసారి తమ సంస్థలోనే ఈ కుర్ర దర్శకుడికి కాదనలేని ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు ఒక స్టార్ హీరో డేట్స్ తీసుకొని అనిల్ రావిపూడికి అప్ప చెబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కోసం కథ సిద్ధం చేయాల్సిందిగా దిల్ రాజు ఇప్పటికే ఈ దర్శకుడి కోరాడని దానికి అనిల్ రావిపూడి కూడా ఓకే చెప్పినట్లు గా ప్రచారం జరుగుతోంది. మరి ఇలాగే అనిల్ రావిపూడి దిల్ రాజు బంధం ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here