సొంత సినిమాల‌పై రివ్యూ చెప్పిన దిల్ రాజు.. న‌చ్చిన‌వి ఏడేనంట‌..

తాము నిర్మించిన సినిమాలలో ఇది బాలేదు అది బాగుంది అని ఏ నిర్మాత అయినా చెబుతాడా.. ఎందుకంటే అన్ని ఆయన నిర్మించిన సినిమాలే కాబట్టి కచ్చితంగా అన్ని బాగున్నాయి అని చెప్పుకుంటాడు. దిల్ రాజు మాత్రం ఈ తరహా నిర్మాత కాదు. ఈయన ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉందో అలా మారిపోయే నిర్మాత. అందుకే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయట పెట్టాడు రాజు. ఇప్పటి వరకు 31 సినిమాలు నిర్మించాన‌ని.. అందులో తనకు సంతృప్తినిచ్చిన సినిమాలు కేవలం ఏడు మాత్రమే ఉన్నాయి అంటూ ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాడు దిల్ రాజు.

dil raju f2 trailer launch

తన గురించి త‌న‌కంటే బాగా ఎవ‌రికి తెలియ‌దంటున్నాడు దిల్ రాజు. త‌ను చేసిన సినిమాల్లో క‌మ‌ర్షియ‌ల్ విజ‌యాలు ఉండొచ్చు కానీ సంతృప్తి ఇచ్చిన సినిమాలు మాత్రం త‌క్కువే అంటున్నాడు ఈయ‌న‌. తాను ఇప్పటి వరకు నిర్మించిన సినిమాల్లో ఆర్య.. బొమ్మరిల్లు.. బృందావనం.. మిస్టర్ పర్ఫెక్ట్.. శతమానం భవతి.. ఎఫ్2 సినిమాలు మాత్రమే సంతృప్తినిచ్చాయని చెప్పాడు దిల్ రాజు. మిగిలిన సినిమాలు కూడా బాగానే ఉంటాయి అని కానీ నిర్మాతగా తనకు సంతృప్తిని ఇచ్చిన సినిమాలు మాత్రం ఇవి అని చెప్పాడు ఈ నిర్మాత‌. ఈయన మాటలు కొందరు హీరోలకు సెటైర్లు వేసినట్లు అనిపించినా కూడా నిజాలు ఒప్పుకున్నాడు ఈ నిర్మాత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here