ఎఫ్ 2 సినిమా 100 కోట్ల షేర్ సాధిస్తుందా..

100 కోట్ల షేర్ సాధించడం అంటే చిన్న విషయం కాదు. చాలా పెద్ద సినిమాలకు కూడా ఇది సాధ్యం కాలేదు. భరత్ అనే నేను, అరవింద సమేత లాంటి సినిమాలు కూడా 90 కోట్ల మేర వచ్చి ఆగిపోయాయి. ఇప్పుడు ఒక సినిమా మాత్రం సంచలనాలు సృష్టిస్తూ ముందుకు వెళుతుంది.

దాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2019లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది f2 సినిమా. అనిల్ రావిపూడి తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఎఫ్2 చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. ఇప్పటి వరకు 76 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం.

మూడు వారాలు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటికీ దూకుడు తగ్గడం లేదంటే ఎప్పుడు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. బాక్సాఫీస్ దగ్గర ఎఫ్2 చిత్రం సృష్టిస్తున్న సంచలనాలు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు విడుదలకు ముందు ఉన్న అంచనాలు ఏంటి.. ఇప్పుడు వస్తున్న వసూలు ఏంటి అంటూ లెక్కలు వేసుకొని కళ్లు తేలేస్తున్నారు.

ఓ సినిమాను నచ్చితే ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తారా అనే విధంగా ఈ సినిమా కలెక్షన్లు వస్తున్నాయి. అన్నీ కుదిరి మరో రెండు వారాలు సినిమా బాగా ఆడితే 100 కోట్లు వసూలు చేయడం కూడా ఖాయం అయిపోయింది. ఈ వారంలోనే 80 కోట్ల షేర్ అందుకోనుంది ఎఫ్2 సినిమా. ఇప్పటికే ఈ సినిమా దెబ్బకు సరైనోడు, జై లవకుశ లాంటి సినిమాఆ రికార్డులు ఎగిరిపోయాయి. ఇప్పుడు మగధీర, అత్తారింటికి దారేది, శ్రీమంతుడు సినిమాలపై కన్నేశారు వరుణ్ తేజ్, వెంకటేష్. వీళ్ళ జోరు చూస్తుంటే ఇది సినిమాలను కూడా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి చివరికి ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here