హాస్పిటల్ లో ఉన్న వెంకటేష్.. షాక్ లో ఉన్న ఫ్యాన్స్..

అదేంటి.. వెంకటేష్ హాస్పిటల్ లో ఉండటం ఏంటి.. ఆయనకు ఏమైంది ఇలా అభిమానులు కంగారు పడుతున్నారు ఇప్పుడు. సంక్రాంతి పండక్కి ఎఫ్ 2 సినిమా సంచలన విజయం సాధించడంతో వెంకీ గాల్లో తేలిపోతున్నాడు. ఇలాంటి సమయంలోనే ఆయనకు అనుకోని సమస్య వచ్చింది. చాలా రోజులుగా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారు వెంకటేష్. ఇప్పుడు ఇది మరీ ఎక్కువ కావడంతో విశాఖపట్నం లోని న్యాచురల్ క్యుర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు విక్టరీ హీరో.

venkatesh

కొన్ని రోజులు అక్కడే ఉండి చికిత్స తీసుకోవాలని వైద్యులు చెప్పడంతో హాస్పిటల్ లోనే అడ్మిట్ అయ్యాడు వెంకటేష్. త్వరలోనే ఈన హైదరాబాద్ రానున్నారు. వచ్చిన వెంటనే నాగచైతన్య, బాబీ కాంబినేషన్ లో వెంకీ మామ సినిమా షూటింగులో జాయిన్ కాబోతున్నాడు వెంకటేష్. మల్టీస్టారర్ సినిమాకు బాగా కలిసి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మేనల్లుడు తో కలిసి నటిస్తున్న సినిమా పై కూడా అభిమానుల్లో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

దానికి తోడు నాగచైతన్యకు ఈ మధ్య కోరుకున్న విజయం అందలేదు. ఇప్పుడు వెంకీ మామ ఆ లోటు భర్తీ చేయాలని చూస్తున్నాడు నాగచైతన్య. మొత్తానికి హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే మేనల్లుడు సినిమాతో బిజీ కానున్నాడు వెంకటేష్. ఏదేమైనా 60 ఏళ్ల వయసులో ఇంతగా కష్టపడుతున్నప్పుడు కచ్చితంగా వెన్నునొప్పి అనేది సహజం. వెంకటేష్ విషయంలో కూడా ఇదే జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here