మ‌హానాయ‌కుడి తండ్రి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు..

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ మాత్రమే కాదు.. మరో బయోపిక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విడుదలయ్యే ప్రతి లుక్ సినిమాపై ఆసక్తి పెంచేస్తుంది. అదే యాత్ర.. మహానాయకుడు వైఎస్సార్ జీవిత చరిత్ర ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆనందోబ్రహ్మ దర్శకుడు మహీ వి రాఘవ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ఫిబ్రవరి 8న యాత్ర విడుదల కానుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర గురించి ఎక్కువగా చూపిస్తున్నాడు దర్శకుడు మహి. మ‌మ్ముట్టి ఈ పాత్రలో నటిస్తున్నాడు. అనసూయ, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలోని మరో కొత్త లుక్ విడుదల అయింది.

jagapathi babu look as ys raja reddy
jagapathi babu look as ys raja reddy

ఇందులో వైఎస్సార్ తండ్రి వైఎస్ రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. కోర మీసం ఖద్దరు చొక్కా తో ఉన్న జగపతిబాబు లుక్కు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు మహీ రాఘవ. కచ్చితంగా ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయమని చెబుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఫిబ్రవరి7న ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల అవుతుంటే.. ఆ తర్వాత రోజు యాత్ర వ‌స్తుంది. ఇద్దరు లెజెండరీ నాయకుల బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారిందిప్పుడు. మరి వీళ్లల్లో ఎవరిని విజయం వరిస్తుంది అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here