మా అమ్మే న‌న్ను అర్థం చేసుకోలేదంటున్న జాన్వీక‌పూర్..

ఇండస్ట్రీకి రాకముందే శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్ లో చాలా వార్తలు వినిపించాయి. ఈమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని.. ముందు నుంచే ఎఫైర్స్ క్వీన్ అంటూ జాన్వికి ఓ అవార్డు కూడా ఇచ్చేసింది బాలీవుడ్. శ్రీదేవి ఉన్నప్పుడే ఈమె చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి కనిపించింది. జాన్వి ఎఫైర్స్ గురించి బాలీవుడ్ కోడై కూస్తున్న సమయంలోనే శ్రీదేవి కూతురుపై సీరియస్ అయిందని వార్తలు అప్పట్లో వినిపించాయి.

ఎవరినైనా ప్రేమిస్తే ఇంట్లో చెప్పాలని.. నచ్చితే పెళ్లి చేస్తాం అంటూ తల్లి తనతో చెప్పిన మాటలను ఇప్పుడు జాన్వీ కపూర్ గుర్తు చేసుకుంది. తాను ఎవరితోనూ ప్రేమలో లేరని అప్పట్లో తన స్నేహితులతో క్లోజ్ గా ఉన్న ఫోటోలు చూసి ఇంట్లో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారని చెబుతుంది ఈ భామ. దడక్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైన జాన్వీ కపూర్ ఇప్పుడు వరుసగా భారీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

jhanvi Kapoor
jhanvi Kapoor

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఎఫైర్స్ గురించి బయటపెట్టిన జాన్వి కపూర్.. అప్పట్లో కొంతమంది స్నేహితులతో దిగిన ఫోటోలు చూసి ఇంట్లో వాళ్లు కూడా ప్రేమలో ఉన్నానేమో అని తప్పుగా అర్థం చేసుకున్నారని.. అలా క్లోజ్ గా ఉండడం తనకి ఏమీ తప్పు అనిపించడం లేదని చెప్పింది జాన్వి. తన తల్లి కూడా అలాగే తప్పుగా అర్థం చేసుకోవడం త‌న‌కు అర్థం కాలేదని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

నచ్చితే పెళ్లి చేస్తాను అప్పుడు తనకు అప్పుడు అర్థం కాలేదని ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి అర్థం అవుతున్నాయి అని చెబుతుంది ఈ భామ‌. ప్రస్తుతం ఈమె ధడక్ హీరో ఇషాన్ క‌ట్ట‌ర్ తో ప్రేమలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై దీని పై జాన్వీ సమాధానం చెబుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here