ఇండియ‌న్ 2 మొద‌లైంది.. ఇక చూస్కోండి ర‌చ్చ..

ఎప్పటినుంచో కమల్ హాసన్ అభిమానులు కలలుకంటున్న ఇండియన్ 2 సినిమా మొదలైంది. శంకర్ ఈ చిత్రాన్ని జనవరి 18న మొదలుపెట్టాడు. 20 ఏళ్ల కింద వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ ఇది. కచ్చితంగా ఈ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించడం ఖాయం అని నమ్ముతున్నారు అభిమానులు.

అయితే ఈ మధ్యకాలంలో శంకర్ స్థాయికి తగ్గ సినిమాలు చేయడం లేదు. 2.0 సినిమా టెక్నికల్ గా ఇండియన్ సినిమా స్థాయిని పెంచేసింది కానీ కమర్షియల్గా ఈ సినిమా ఊహించిన విజయం సాధించలేదు. మరోవైపు కమల్ హాసన్ కూడా ఈ మధ్య వెనుకబడిపోయాడు. ఇలాంటి సమయంలో ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమాపై ఆస‌క్తి అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మరోవైపు కమల్ హాసన్ రాజకీయాల్లో ఉండడం కూడా భారతీయుడు సినిమా పై ఆసక్తి పెంచేస్తుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగా ఈ సినిమా కథను సిద్ధం చేసుకుంటున్నాడు శంకర్.

షూటింగ్ కేవలం ఒకే ఏడాదిలో పూర్తి చేసి 2020 ఫిబ్రవరి నాటికి సినిమా విడుదల చేస్తానని చెబుతున్నాడు శంకర్. ఇది నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా కచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అంటున్నాడు ఈ దర్శకుడు. దానికి తోడు కమల్ కూడా రాజకీయాల్లోనే ఉండటంతో సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన కండిషన్ పెట్టాడు. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు అక్షయ్ కుమార్ కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది.

indian 2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here