చేసింది మొత్తం కంగనారనౌత్.. ఆమె చాలా మూర్ఖంగా ప్రవర్తించింది..

ఈ మాటలు అన్నది ఎవరో కాదు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.. ఆయనను ఎంతగా సతాయించి ఉంటే ఒక లేడీ డైరెక్టర్ ను, నటిని ఇంత మాట అంటాడు. కంగనా రనౌత్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయట పెట్టాడు క్రిష్. తాను మణికర్ణిక సినిమాను గత ఏడాది జూన్లోనే పూర్తి చేశానని అప్పటికే అందరు డబ్బింగ్ కూడా పూర్తి చేశారని చెప్పాడు. కంగనా రనౌత్ మాత్రమే డబ్బింగ్ చెప్పలేదని.. ఆమె మరో సినిమాతో బిజీగా ఉండటంతో తర్వాత డబ్బింగ్ చెప్తాను అని తనతో చెప్పినట్లు గుర్తు చేశారు ఈ దర్శకుడు. అయితే సినిమా మొత్తం చూసిన తర్వాత కంగనా రనౌత్ కు నచ్చింది అని.. కానీ తనకు నచ్చినట్లు కొన్ని సీన్లు మార్చాలి అంటూ తనపై ఒత్తిడి తీసుకు వచ్చినట్లు గుర్తు చేశాడు. అలా చేస్తే చరిత్రను వక్రీకరించినట్టు అవుతుందని తను ఒప్పుకోలేదు అని చెప్పాడు క్రిష్. కానీ కచ్చితంగా మార్చాల్సిందే అంటూ మూర్ఖంగా కంగనా రనౌత్ ప్రవర్తించిందని చెప్పాడు ఈ దర్శకుడు.

krish kangana ranaut manikarnika

ఈ ఒక్క విషయంలోనే కాదు ఇంకా చాలా విషయాల్లో కంగనా రనౌత్ సినిమా యూనిట్ విషయంలో మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుందని సంచలన నిజాలు బయట పెట్టాడు ఈ దర్శకుడు. అందుకే తాను బయటకు రావాల్సి వచ్చిందని.. వచ్చే సమయానికి సినిమా అంతా పూర్తి చేసి వచ్చాను అంటున్నాడు క్రిష్. దానికి తోడు నిర్మాతలకు తన గురించి కంగనా రనౌత్ చెడుగా చెప్పింది అంటున్నాడు. తాను తీసిన సినిమా భోజ్ పూరి సినిమాల ఉందని నిర్మాతలు చెప్పినట్లు తన తనతో చెప్పిందని స్టేట్మెంట్ ఇచ్చాడు క్రిష్. సోనూసూద్ సినిమా నుంచి బయటికి వెళ్లడానికి కారణం కూడా కంగనా రనౌత్ అని క్లారిటీ ఇచ్చాడు క్రిష్. ఈ సినిమాలో ఆయన పాత్ర 100 నిమిషాలు ఉంటే కంగనా రనౌత్ దాన్ని 60 నిమిషాలకు కట్ చేసిందని.. అందుకే సోనూసూద్ సినిమా నుంచి బయటికి వెళ్లిపోయాడు అని చెప్పాడు క్రిష్. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టే మణికర్ణిక సినిమా నుంచి చాలామంది బయటకు వచ్చేశారు అంటూ గుర్తు చేశారు ఈ దర్శకుడు. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలతో కంగనా రనౌత్ పై ఇండస్ట్రీలో ఉన్న గౌరవం తగ్గిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here