మహేష్ అభిమానులకు పండగ.. AMBలో మైనపు విగ్రహం..

మహేష్ బాబు ఇప్పుడు కేవలం హీరో మాత్రమే కాదు.. బిజినెస్ మాన్ కూడా. హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఈయనకు ఏ ఎన్ బి సినిమాస్ పేరుతో ఒక మల్టీప్లెక్స్ ఉంది. మరొకరి భాగస్వామ్యంతో దీన్ని నిర్మించాడు సూపర్ స్టార్. ఇందులో దాదాపు 150 కోట్లు పెట్టుబడి పెట్టాడు మహేష్ బాబు. ఈ మధ్య ఇది ఓపెన్ అయింది. ఇక ఇప్పుడు ఇందులో మహేష్ బాబు మైనపు విగ్రహం పెట్టబోతున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో మహేష్ బాబు మైనపు విగ్రహం ఉంది. త్వరలోనే ఇది హైదరాబాద్ రాబోతుంది.
mahesh babu wax statue
mahesh babu wax statue
వచ్చిన తర్వాత మహేష్ అభిమానుల కోసం ఆయన మల్టీప్లెక్స్ లోని ప్రదర్శనకు ఉంచనున్నారు. ఇది ఎప్పుడు అనేది త్వరలోనే తేలనుంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి సింగపూర్ మేడం టుస్సాడ్ మ్యూజియంలో ప్రభాస్ తర్వాత మహేష్ బాబుకు చోటు దక్కింది. ఈయన ఇమేజ్ ఇప్పుడు తెలుగులోనే కాకుండా మిగిలిన భాషలలో, దేశాల్లో కూడా పెరిగిపోతుంది. మ్యూజియంలో మైనపు విగ్రహం కూడా దీనికి నిదర్శనం. మొత్తానికి హైదరాబాద్ కు మహేష్ బాబు మైనపు విగ్రహం వస్తుండటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతున్నారు. ఈ విగ్రహం కోసం అయినా మళ్లీ మల్టీప్లెక్స్ కు అభిమానుల తాకిడి పెరగడం ఖాయం. ప్రస్తుతం ఈయన మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 25 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here