రాజ‌మౌళికి షాక్.. ఆర్ఆర్ఆర్ గుట్టు విప్పిన కీర‌వాణి..

తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు రాజమౌళి. చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వెళ్లకుండా ఎంతో కేర్ తీసుకుంటాడు. ఇప్పుడు తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా గురించి కూడా ఇలాంటి జాగ్రత్తలే తీసుకున్నాడు దర్శక‌ధీరుడు. అటు ఎన్టీఆర్ కానీ.. ఇటు రామ్ చరణ్ కానీ ఎవరు ఈ సినిమా గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. ఏమ‌డిగినా కూడా రాజమౌళికి తెలుసు.. అంతా ఆయన్నే అడగండి అంటూ చెబుతున్నారు వాళ్లు. అంతలా వాళ్ల‌ను ట్రైన్ చేశాడు జక్కన్న. ఇలాంటి సమయంలో తన ఇంటి నుంచే కథ లీక్ అవుతుందని అస్సలు ఊహించి ఉండడు రాజమౌళి. కానీ ఇప్పుడు ఇదే జరిగింది.. ట్రిపుల్ ఆర్ పై తనకు తెలియకుండానే కీరవాణి ఒక క్లూ ఇచ్చేశాడు. సినిమాకు సంగీతం ఎలా ఉండబోతుంది అని మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు నోరు జారాడు కీరవాణి.

Keeravani reveals RRR story
Keeravani reveals RRR story

ఈ చిత్రానికి ట్రెండీ మ్యూజిక్ తో పాటు పీరియాడికల్స్ ట్యూన్స్ కూడా ఇస్తున్నానంటూ చెప్పాడు ఈ సంగీత దర్శకుడు. ఈయన చెప్పిన సమాధానంతో నుంచి ఇన్నాళ్ళుగా క‌థ‌పై ఉన్న క‌న్ఫ్యూజ‌న్ ఒక్కసారిగా క్లియర్ అయిపోయింది. రాజమౌళి సినిమా 1920లో నేపథ్యంలో సాగుతుందని వార్తలు కొంతకాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇప్పుడు కీర‌వాణి చెప్పిన దాంతో అది నిజమే అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అభిమానులు. పునర్జన్మల నేపథ్యంలో సాగే కథ ఇదని తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ ఛాయలున్న పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో రెండో షెడ్యూల్ కి వెళ్ళనుంది. మొత్తానికి తనకు తెలియకుండానే తమ్ముడు సినిమా కథ లీక్ చేశాడు కీరవాణి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here