నాగార్జున మాట‌ల్లో నిజం ఉందా..?

ఇప్పుడు ఇండ‌స్ట్రీ గురించి ఎవ‌రో బ‌య‌టి వాళ్లు మాట్లాడితే లోపల జ‌రిగేది మీకేం తెలుసు.. ఇక్క‌డ అంతా బాగానే ఉంటుంది అని స‌ర్ది చెప్పొచ్చు. కానీ సీనియ‌ర్ హీరో.. పుట్టిన‌ప్ప‌ట్నుంచీ ఇండ‌స్ట్రీని చూసిన నాగార్జున కూడా హీరోల‌పై క‌మెంట్ చేస్తే న‌మ్మ‌కుండా ఎలా ఉంటారు ప్రేక్ష‌కులు.
NAGARJUNA
ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. గూఢ‌చారి స‌క్సెస్ మీట్ లో నాగార్జున ఎగ్జైట్ మెంట్ లో మాట్లాడిన మాట‌లే ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. స్టార్ హీరోల‌కు కాస్త ఆటిట్యూడ్ ఉంటుంది.. ప‌ది నిమిషాలు క్యార్ వ్యాన్ రాక‌పోతే పిచ్చెక్కిపోతుంది.. క‌థ చూసుకోకుండా బ‌డ్జెట్ పెంచేస్తున్నారు.. ఇలా తీస్తూ పోతే సినిమాలు తీయ‌డం కాదు సోంబేరీలం అయిపోతాం.. ఇలా చాలా మాట్లాడేసాడు నాగార్జున‌.
ఈయ‌న మాట‌ల్లోని అర్థం అయితే ఇదే. దాంతో ఇప్పుడు మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా నాగ్ పై కోపంగానే ఉన్నారు. నాగార్జున మాట‌ల్లో కూడా నిజం లేక‌పోలేదు. క‌థ చూసుకోకుండా కోట్లు ఖ‌ర్చు చేస్తుండ‌టం ఇప్పుడు చాలానే చూస్తున్నాం. ముందు వెనక చూడ‌కుండా కేవ‌లం హీరో ఉన్నాడు క‌దా అని బ‌డ్జెట్ లు పెట్టేసి చేతులు కాల్చుకుంటున్నారు నిర్మాత‌లు. అయితే ఎవ‌రికీ చెప్పే ధైర్యం స‌రిపోలేదు.. నాగార్జున కాబ‌ట్టి మీడియా ముందు సూటిగా చెప్పాడు. మ‌రి ఈయ‌న మాట‌ల్ని ఇప్పుడెంత మంది హీరోలు సీరియ‌స్ గా తీసుకుంటారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here