పెళ్లి పీట‌లెక్క‌బోతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్..

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్ ఎవ‌రు పెళ్లి చేసుకుంటున్నారు అనుకుంటున్నారా… ఆమె ప‌వ‌న్ తో ఒక్క సినిమా కూడా చేయ‌క‌పోయినా కూడా ప‌వ‌న్ హీరోయిన్ గానే పాపుల‌ర్ అయింది. ఆ ముద్దుగుమ్మ ఎవ‌రో కాదు అనీషా ఆంబ్రోస్. ఇప్పుడు ఈ విజ‌యవాడ అమ్మాయి పెళ్లి పీటలు ఎక్కబోతుంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది ఈ భామ‌. ఫిబ్రవరిలో అనీషా పెళ్లి జరగనుంది. డిసెంబర్ లోనే తన బాయ్ ఫ్రెండ్ గుణ జక్కాతో నిశ్చితార్థం చేసుకుంది అనీషా ఆంబ్రోస్.

ఇక ఫిబ్రవరి లో వీళ్ళ పెళ్లి జరగబోతుంది. ఈ పెళ్లికి టాలీవుడ్ పెద్దలు కూడా వస్తారని తెలుస్తోంది. తెలుగులో దాదాపు అరడజను సినిమాలు చేసినా కూడా ఈ ముద్దుగుమ్మకు కోరుకున్న గుర్తింపు రాలేదు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కూడా అనూష అంటే కేరాఫ్ పవన్ కళ్యాణ్ అంటారు అభిమానులు. దానికి కారణం కూడా లేకపోలేదు ఆమధ్య గ‌బ్బ‌ర్ సింగ్ 2 సినిమాలో ముందు అనీషా ఆంబ్రోస్ ని హీరోయిన్ గా అనుకున్నారు. ఆ తర్వాత కాజల్ వచ్చింది.

పవన్ సినిమాలో నటించలేకపోయినా కూడా ఆయనతో నటిస్తోంది అనే వార్త ఈ ముద్దుగుమ్మను టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మార్చేసింది. కేవలం ఆ గుర్తింపుతోనే అరడజను సినిమాల్లో నటించింది అనీషా ఆంబ్రోస్. ఇప్పుడు సినిమాలకు దూరమై ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

Anisha Ambrose Okkadu Migiladu Interview Stills

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here