ప్ర‌భాస్ తో మున్నా బాకీ తీర్చుకుంటానంటున్న దిల్ రాజు..

ప్రభాస్ ప్రభాస్ ప్రభాస్.. ఇప్పుడు నిర్మాతలు ఈయనతో సినిమా చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ప్రభాస్ ఎవరికి అందడం లేదు. ఈయనతో సినిమా అంటే ఇప్పుడు వాళ్లు ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఎందుకంటే కనీసం 200 కోట్లు లేకపోతే ప్రభాస్ తో సినిమా చేయడం కష్టం ఇప్పుడు. ఈయన చేసే సినిమాలు.. ఎంచుకుంటున్న కథలు కూడా అలాగే ఉన్నాయి. యూనివర్సల్ అప్పీల్ ఉన్న క‌థ‌ల‌కు మాత్ర‌మే ప్ర‌భాస్ ఓటు పడుతుంది. ఇప్పుడు నటిస్తున్న సాహో సినిమా కూడా అంతే. ఈ చిత్రానికి భాష తో పని లేదు.. ఇది ఇండియన్ సినిమా. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడనటువంటి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సుజిత్. దీంతోపాటు రాధా కృష్ణ కుమార్ సినిమా కూడా దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

prabhas movie with Dil Raju
prabhas movie with Dil Raju

ఈ రెండు సినిమాలు ఇలా ఉండగానే ఇప్పుడు ప్రభాస్ మరో రెండు వందల కోట్ల సినిమాకు ముహూర్తం పెట్టనున్నారనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దీనికి నిర్మాత దిల్ రాజు అని తెలుస్తోంది. పదేళ్ల కింద ఈ కాంబినేషన్లో మున్నా సినిమా వ‌చ్చి ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఆ లోటు భర్తీ చేయాలని చూస్తున్నాడు దిల్ రాజు. ఇంతకీ ప్రభాస్ తో ఆ రెండు వందల కోట్ల సినిమా చేయ‌బోయే ఆ దర్శకుడు ఎవ‌రో తెలుసా.. ప్ర‌స్తుతం కేజిఎఫ్ సినిమాతో సంచ‌ల‌నం సృష్టిస్తున్న ప్రశాంత్ నీల్. ఈయన రాసిన కథ ప్రభాస్ కు బాగా సరిపోతుందని దిల్ రాజు భావిస్తున్నాడు. అందుకే ఈ కాంబినేషన్ లో కలపాలని ట్రై చేస్తున్నాడు. మరి ఇది కుదురుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here