ఆర్.ఎఫ్.సిలో తెలుగు హీరోల సందడి.. రాజమౌళి ప్రభాస్ ఒకే చోట..

మన హీరోలంతా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎవరు ఖాళీగా లేరు. ముఖ్యంగా రామోజీ ఫిలిం సిటీ సూపర్ స్టార్స్ తో నిండిపోయింది. ప్రస్తుతం అక్కడ రాజమౌళి, ప్రభాస్, బాలకృష్ణ ఇలా అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ వాళ్ళ సినిమాల షూటింగులతో బిజీగా మారిపోయారు. ప్రభాస్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న సాహో సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. కొంతకాలంగా రాధాకృష్ణ కుమార్ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్.. ఇప్పుడు మళ్లీ సాహో తో బిజీ అయిపోయాడు. రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు.

RRR Movie Launch Photos

అక్కడే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సుజీత్. ఇక ఈయనతో పాటు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా అక్కడే షూటింగ్ జరుపుకుంటుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. రాజమౌళి, ప్రభాస్ ఒకే చోట ఉండటంతో ఆర్.ఆర్. ఆర్ లో యంగ్ రెబల్ స్టార్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇద్దరితో పాటు బాలకృష్ణ మహానాయకుడు సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతుంది. ప్రస్తుతం చివరి దశలో ఉంది బాలయ్య సినిమా షూటింగ్. ఈ మూడు సినిమాలతో పాటు మరో మూడు నాలుగు సినిమాల షూటింగులు కూడా రామోజీ ఫిలిం సిటీ లోనే జరుగుతున్నాయి. మహా నాయకుడు సినిమా ఫిబ్రవరి 28న మహాశివరాత్రి కానుకగా విడుదల కానుందని తెలుస్తోంది. మొత్తానికి మన హీరోలంతా బిజీగా ఉండటంతో అభిమానులు కూడా సంతోషంగా కనిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here