మీ టూ మళ్ళీ మొదలైంది.. ఈ సారి బలైంది రాజ్ కుమార్ హిరానీ..

కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో కూడా మీ టూ గురించి చర్చ లేదు. దాంతో ఇది పూర్తిగా అయిపోయింది అనుకొని సంతోషంగా ఉన్నారు దర్శక నిర్మాతలు. సినిమా ఇండస్ట్రీలో కూడా దీని గురించి చర్చ లేకపోవడంతో అంతా హాయిగా ఉన్నారు. కానీ కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని మీటూ మళ్ళీ పుంజుకోవడానికి సిద్ధమవుతుంది. తాజాగా రాజ్ కుమార్ హిరానీ పై ఓ లేడీ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఒక లేడీ తనను ఆరు నెలల పాటు రాజ్కుమార్ హిరాని లైంగికంగా వేధించాడంటూ ఆ చిత్ర నిర్మాత విదు వినోద్చోప్రా కు లేఖ రాసింది.
ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హిరాని అంటే దేశం గర్వించదగ్గ దర్శకుడు అని.. ఆయన దగ్గర పనిచేయడం గౌరవంగా భావించానని.. కానీ ఆయన మాత్రం తనను ఆరునెలలపాటు లైంగికంగా వేధించి మనసు శరీరం రెండూ పాడయ్యేలా చేసాడని ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈమె చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ కూడా షాక్ అయిపోయి చూస్తుంది. హీరానీ లాంటి దర్శకుడిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో ఆయన అభిమానులు కూడా బాధ పడుతున్నారు. నిజంగానే ఆయన అలా చేసి ఉంటారా లేదంటే ఏదైనా కుట్ర చేస్తున్నారని వాళ్లు భావిస్తున్నారు. మొత్తానికి ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మీ టూ మళ్లీ పుంజుకోవడానికి రెడీ అవుతుంది. మరి ఈసారి ఎవరెవరు పేర్లు బయటకు వస్తాయి అనేది సంచలనంగా మారుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here