డిస్కో రాజా అలా ఉండ‌బోతుంద‌ట‌.. ర‌వితేజ ర‌చ్చ రంబోలా..

వరుస పరాజయాలతో ఉన్న రవితేజ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాకు డిస్కో రాజా టైటిల్ కన్ఫర్మ్ చేశారు దర్శక నిర్మాతలు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి సినిమాలు తెరకెక్కించిన వీ ఐ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కాస్త ప్రయోగాత్మక కథతో పాటు వినోదం కూడా తగ్గకుండా రవితేజ ఇమేజ్ కి తగ్గట్లు బ్యాలెన్స్ చేస్తూ డిస్కో రాజా సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఆనంద్.

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 40 శాతం పూర్తయింది. ఈ ఏడాది సమ్మర్లో సినిమాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఆనంద్. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.. తండ్రి కొడుకులు గా నటిస్తున్నాడు అని తెలుస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్నాడు మాస్ రాజా. ఆర్ ఎక్స్ 100 సినిమాలో ముద్దులతో రెచ్చిపోయిన పాయల్ రాజ్ పుత్.. టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్.. నన్ను దోచుకుందువటే సినిమాలో మాయ చేసిన న‌భా న‌టేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రంతో కచ్చితంగా ఫామ్ లోకి వ‌స్తానంటూ ధీమాగా చెబుతున్నారు మాస్ రాజా. చూస్తుంటే ఆయన నమ్మకం కూడా నిలబడేలాగే కనిపిస్తుంది. కచ్చితంగా ఈ సినిమాతో రవితేజ హిట్ కొడతాడని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. జనవరి 26న ఆయన పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ లోగో లాంచ్ చేశారు దర్శక నిర్మాతలు. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి మాయ చేయబోతున్నాడు అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here