పుస్తకం పవన్ కళ్యాణ్ కోసం కాదు.. రేణుదేశాయ్ సంచలనం..

రేణు దేశాయ్.. ఈ మాట వినగానే మనకు గుర్తొచ్చే పేరు పవన్ కళ్యాణ్. ఎందుకంటే తెలుగులో రేణు అంటే కేరాఫ్ పవర్ స్టార్. ఆయనతో పన్నెండేళ్లు కలిసి ఉంది రేణు దేశాయ్. ఆ తర్వాత విడిపోయి పూణేలో ప్రస్తుతం పిల్లలతో కలిసి ఉంది పవన్ మాజీ భార్య. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది రేణు దేశాయ్. తాజాగా ఓ పుస్తకం పుస్తకం రాసింది ఈమె. అందులో పవన్ కళ్యాణ్ గురించిన చాలా విషయాలు చర్చించింది రేణుదేశాయ్. అయితే పవన్ పేరు పెట్టకుండా తన జీవితంలో జరిగిన చాలా సంఘటనలను ఈ పుస్తకంలో పొందుపరచింది. తన జీవితం.. రొమాన్స్.. బాధలు.. సంతోషాలు ఈ పుస్తకంలో రాసుకుంది రేణు. ఇక ఇప్పుడు పుస్తకంపై లేనిపోని వివాదాలు రేగుతున్నాయి.

Renu Desai hits back at Pawan Kalyan fans

ఈ విషయంపై రేణు కూడా ఇప్పుడు మనసు విప్పి మాట్లాడింది. తాను ఈ పుస్తకం రాసింది పవన్ కళ్యాణ్ కోసం కాదు అని తన జీవితంలో జరిగిన చాలా సంఘటనలు మాత్రమే ఇందులో రాశాను అని చెబుతోంది రేణుదేశాయ్. అంతే కానీ పవన్ ని దృష్టిలో పెట్టుకుని కాదు అని అభిమానులకు క్లారిటీ ఇచ్చింది ఈ భామ. పవన్ కళ్యాణ్ కాకపోతే మరో వ్యక్తి తనకు భర్త అయ్యుండేవాడని.. అతనితో ఈ సంతోషాలను అనుభవించే దాన్ని అంతే.. అప్పుడు కూడా తన అనుభవాలన్నీ ఇలాగే ఉండేవని కేవలం పవన్ కళ్యాణ్ కోసం తన పుస్తకం రాశాను అనుకోవడం తప్పు అని చెబుతోంది రేణుదేశాయ్. ఇందులో పవన్ కు సంబంధించిన విషయాలు ఏమీ లేవని.. తన జీవితంలో జరిగిన విషయాలు మాత్రమే ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది రేణు. మరి ఇప్పుడు ఈమె చెప్పిన సమాధానంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతవరకు సంతృప్తి పడతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here