సంక్రాంతి సినిమాల కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసా..

సంక్రాంతి పండగ రానే వచ్చింది.. వారం రోజుల ముందుగానే సినిమాలతో పండగ సీజన్ బాక్సాఫీస్ దగ్గర వచ్చిందని సంతోషపడ్డారు అభిమానులు. కానీ 2019 సంక్రాంతి తెలుగు సినిమాకు పెద్దగా కలిసి రాలేదు. పండక్కి నాలుగు సినిమాలు విడుదలైతే అందులో కేవలం ఒకటి మాత్రమే విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది. మిగిలిన మూడు సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చేలా కనిపిస్తున్నాయి. పండక్కి అందరికంటే ముందు వచ్చిన కథానాయకుడు సినిమాకు టాక్ బాగానే వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం రావడం లేదు. ఈ సినిమా 5 రోజుల్లో కేవలం 20 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
sankranthi movies
sankranthi movies
ఇక ఆ రోజు విడుదలైన పేట సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కాకపోతే థియేటర్లు సరిగ్గా లేకపోవడంతో ఈ సినిమాకు తెలుగులో ఆశించిన వసూళ్లు రావడం లేదు. రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామా సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీ చెత్త సినిమాల రికార్డుల్లో తన పేరు లిఖించుకుంది. మూడు రోజుల్లో 34 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. కానీ రామ్ చరణ్ సినిమా సేఫ్ కావాలంటే 95 కోట్లు రావాలి. ఇక పండగ సినిమాల్లో అందరికంటే చివరగా వచ్చిన ఎఫ్ 2 కలెక్షన్ల పండగ చేసుకుంటుంది. నవ్విస్తూ ముందుకు సాగిన ఎఫ్ 2 కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమా వైపు పరుగులు తీస్తున్నారు. దిల్ రాజు నిర్మాత కావడం.. వెంకటేష్ సినిమాలో ఉండటంతో కలెక్షన్ల పంట పండుతుంది. ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం ఈ సంక్రాంతికి ఎఫ్2 విజేతగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here