ఓవర్సీస్ లో సంక్రాంతి సినిమాలు ఫసక్..

భారీ అంచనాల మధ్య విడుదలైన సంక్రాంతి సినిమాలు ఊహించిన విధంగా కలెక్షన్లు సాధించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎలాగో ఈ సినిమాలు వెనక పడిపోయాయి. దేశం కాని దేశంలో కూడా మన సినిమాలు పెద్దగా ప్రభావం చూపించక పోవడం విశేషం. ఎఫ్2 మినహాయిస్తే మిగిలిన మూడు సినిమాలు ఓవర్సీస్లో చేతులెత్తేస్తున్నాయి. కథానాయకుడు సినిమా ఇప్పటివరకు ఓవర్సీస్లో 8 లక్షల డాలర్లు వసూలు చేసింది.. కానీ ఈ సినిమా సేఫ్ అనిపించుకోవాలంటే రావాల్సింది 2 మిలియన్.
sankranthi movies 2019
ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ రెండు మిలియన్లు వసూలు చేయడం కథానాయకుడికి కలలో మాట. ఇక ఆ తర్వాత సినిమా పేట 1.5 మిలియన్ వసూలు చేసినా 3 మిలియన్ వరకు తీసుకొస్తే కానీ లాభాల బాట పట్టదు. రామ్ చరణ్ సినిమా 1.8 మిలియన్ తీసుకొస్తే హిట్ అనిపించుకుంటుంది కానీ ఇప్పటి వరకు కనీసం మూడు లక్షల డాలర్లు కూడా వసూలు చేయలేని ఈ సినిమా హాఫ్ మిలియన్ వైపు వెళ్లడం కష్టంగా ఉంది. దాంతో ఈ సినిమా అక్కడ డిజాస్టర్ అని తేలిపోయింది. పండగ సినిమాల్లో చివరగా విడుదలైన ఎఫ్ 2 ప్రస్తుతం అక్కడ పండగ చేసుకుంటుంది. నేడో రేపో వన్ మిలియన్ వసూలుచేసి ఓవర్సీస్ హిట్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా ఈ పండక్కి కేవలం ఒక్క సినిమా మాత్రమే పండగ చేసుకుంటుంది.. మిగిలిన సినిమాలన్నీ వేడుక చూస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here