ఎఫ్ 2 సినిమాను త‌క్కువ అంచ‌నా వేసారో..? 

ఈ సంక్రాంతికి ఏ సినిమాపై ఎక్కువగా అంచనాలు ఉన్నాయి.. ఈ ప్రశ్న ఎవరిని అడిగినా కూడా ఒకటి ఎన్టీఆర్ బయోపిక్ లేదంటే రామ్ చరణ్ సినిమా ఈ రెండిట్లో ఏదో ఒక సమాధానం మాత్రమే వస్తుంది. కానీ ఎవరికీ తెలియకుండా మూడో సినిమా కూడా ఉంది. దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. చిన్న సినిమా కాదని తక్కువగా అంచనా వేస్తే ఖచ్చితంగా అదే మేకై కూర్చుంటుంది.

అదే వెంకటేశ్, వరుణ్ తేజ నటించిన ఎఫ్ 2. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. జనవరి 12న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే పూర్తయిన సెన్సార్ రిపోర్ట్ బట్టి చూస్తే మొదటి నుంచి చివరి వరకు నవ్వించడం ఒక్కటే అనిల్ రావిపూడి పెట్టుకున్న లక్ష్యంగా తెలుస్తుంది.

ఈ చిత్రం కచ్చితంగా వెంకటేష్, వరుణ్ తేజ్ కు బ్లాక్ బస్టర్ ఇస్తుందని చెబుతున్నాడు నిర్మాత దిల్ రాజు. పైగా దిల్ రాజుకు సంక్రాంతి సీజన్ బాగా క‌లిసి వచ్చింది. ఎవడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలు పండ‌క్కి వచ్చి మంచి విజయం సాధించాయి. రెండేళ్ల కింద శతమానంభవతి గురించి చెప్పాల్సిన పని లేదు. ఇలా పండ‌క్కి వ‌చ్చి ప్రతిసారి సంచలనాలు సృష్టిస్తున్న దిల్ రాజు.. ఈసారి కూడా అదే చేస్తాడ‌ని న‌మ్ముతున్నారు అభిమానులు. మొత్తానికి పండగ సీజన్లో సైలెంట్ కిల్లర్ లా మారిపోయింది ఎఫ్ 2.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here