అఖిల్ ఏదో చేస్తున్నాడు క‌దా..

HELLO!-Pre-Release-Event-Photos
అస‌లు ఓ తెలుగు హీరో ఇలా స్టేజ్ పై డాన్సులు చేయ‌డం ఎప్పుడైనా చూసారా..? త‌న ఆడియో వేడుక‌లో కూడా ఏ హీరో డాన్స్ చేయ‌డు కానీ ఇప్పుడు అఖిల్ అన్ని రూల్స్ మార్చేస్తున్నాడు. ఒక్క హిట్ కోసం అన్నీ మార్చేస్తున్నాడు అక్కినేని వార‌సుడు. ఇప్పిట వ‌ర‌కు తెలుగులో ఏ హీరో చేయ‌ని విధంగా ప్ర‌మోష‌న్ చేసుకుంటున్నాడు. మొన్న ఆడియో వేడుక‌.. నిన్న అమెరికా.. ఇప్పుడేమో ప్రీ రిలీజ్ వేడుక‌.. ఇలా అన్ని చోట్లా త‌న ప‌ర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు అఖిల్. ప్రీ రిలీజ్ వేడుక‌లో అయితే అది ఇంకాస్త పీక్స్ కు వెళ్లిపోయింది. మొన్న ఆడియో రిలీజ్ లోనే చెప్పాల్సిందంతా చెప్పేసాక‌.. ఇక సినిమా గురించి చెప్ప‌డానికి ఏం మిగ‌ల్లేదు అందుకే డాన్సుల‌తో ర‌ప్ఫాడించాడు అఖిల్. ప్రోగ్రామ్ కు కూడా డాన్స్ అండ్ సింగ్ విత్ అఖిల్ అని పెట్టాడు సిసింద్రీ. అనుకున్న‌ట్లుగానే పాట‌లు పాడాడు.. డాన్సులు కూడా చేసాడు. ఎన్ క‌న్వెన్ష‌న్ మొత్తం అఖిల్ జోరుతో ఊగిపోయింది. ఈ కుర్రాడు ప‌డుతున్న క‌ష్టం చూసైనా.. క‌చ్చితంగా హ‌లో హిట్ట‌య్యేలా క‌నిపిస్తుంది. ఈ సినిమా కోసం త‌న ప్రాణం పెట్టేస్తున్నాడు అనేది కూడా త‌క్కువే అవుతుందేమో..? మ‌రి ఈ క‌ష్టానికి అఖిల్ ఫ‌లితం అందుకుంటాడేమో చూడాలిక‌..! డిసెంబ‌ర్ 22న హ‌లో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here