అభిమ‌న్యుడు ప్రివ్యూ


విశాల్ సినిమాలంటే తెలుగులోనూ తెలియ‌ని అభిమానం ఉంటుంది. ఎందుకంటే తెలుగ‌బ్బాయి క‌దా.. మ‌నోడు వెళ్లి త‌మిళ‌నాట ర‌ప్ఫాడిస్తున్నాడు అనే చిన్న గ‌ర్వం అంద‌ర్లోనూ ఉంటుంది. అందుకే ఈ హీరో సినిమాల‌ను ఎవరూ డబ్బింగ్ సినిమాల మాదిరి ట్రీట్ చేయ‌రు. కాస్త బాగుంటే చాలు.. మాస్ ఆడియ‌న్స్ పాజిటివ్ గా తీసుకుంటారు విశాల్ సినిమాల‌ను.
ఇప్పుడు ఈయ‌న అభిమ‌న్యుడు అంటూ మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల మెప్పు కోసం వ‌స్తున్నాడు. గ‌త కొన్నేళ్లుగా యావ‌రేజ్ సినిమాల‌తోనే కాలం గ‌డిపేస్తున్న విశాల్ కు ఇది త‌మిళ‌నాట బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చింది. తెలుగులో కూడా ఇదే మ్యాజిక్ రిపీట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాడు విశాల్. డిజిట‌ల్ మీడియాలో జ‌రిగే మోసాల‌ను చూపించారు. ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది ఈ స‌బ్జెక్ట్ ఇప్పుడు. ఈ చిత్రంతో పాటే రాజ్ త‌రుణ్ రాజుగాడు.. నాగార్జున ఆఫీస‌ర్ విడుద‌ల‌కు సిద్ధ‌మైనా కూడా న‌మ్మ‌కంగానే ఉన్నాడు విశాల్. మ‌రి చూడాలిక‌.. త‌మిళ్ లో బాగా గ‌ట్టిగా కొట్టిన విశాల్.. తెలుగులో ఏం చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here