అమితాబ్ ఎక్క‌డికి పోలేదు.. ఇదిగో సాక్ష్యం.. 


ఈ రోజుల్లో ఓ సినిమా మొద‌లైందంటే అది పూర్త‌య్యేవ‌ర‌కు రోజుకో ర‌కంగా రూమ‌ర్లు వ‌స్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా సైరాపై తొఇ రోజు నుంచే ఇలాంటి గాసిప్స్ వ‌స్తున్నాయి. ముందు రెహ‌మాన్ పై గాసిప్ వ‌చ్చింది.. నిజ‌మైంది. ఆ త‌ర్వాత సినిమాటోగ్ర‌ఫర్ ర‌వివ‌ర్మ‌న్ పై గాసిప్ వ‌చ్చింది.  అది కూడా నిజ‌మైంది. ఇక ఇప్పుడు అమితాబ్ బచ్చ‌న్ పై కూడా గాసిప్ వ‌చ్చింది. కానీ ఇప్పుడు మాత్రం నిజం కాలేదు. ఇది అబ‌ద్ధం. సైరా నుంచి బిగ్ బి త‌ప్పుకున్నాడ‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఎలాంటి నిజం లేద‌ని సురేంద‌ర్ రెడ్డి నిరూపించాడు. ముంబై వెళ్లి అమితాబ్ బ‌చ్చ‌న్ ను క‌లిసాడు. క‌థ చెప్పాడు. షెడ్యూల్స్ గురించి వివ‌రించాడు. త‌న పాత్ర ఎలా ఉంటుందో కూడా బ్రీఫ్ ఇచ్చి వ‌చ్చాడు. సాక్ష్యంగా ఓ ఫోటోను కూడా నెట్ లో పెట్టేసాడు. ఇవ‌న్నీ జ‌ర‌గ‌డానికి వెన‌క సూత్ర‌ధారి మాత్రం చిరంజీవే. హైద‌రాబాద్ లోనే ఉంటూ ముంబైలో ఉన్న మెగాస్టార్ తో ముచ్చ‌ట్లు పెడుతున్నాడు మ‌న మెగాస్టార్. రెండో షెడ్యూల్ లో బిగ్ బి రాక‌పోవ‌చ్చు కానీ మూడో షెడ్యూల్ కు మాత్రం ఆయ‌న రానున్నాడు. న‌ర‌సింహారెడ్డి గురువు పాత్ర‌లో అమితాబ్ న‌టించ‌బోతున్నాడు. ఈ పాత్ర కోస‌మే ప్ర‌త్యేకంగా తెలుగు నేర్చుకుంటున్నాడు అమితాబ్ బ‌చ్చ‌న్. మొత్తానికి ప్ర‌తీసారి వ‌స్తున్న గాసిప్ నిజ‌మౌతుంటే.. అమితాబ్ కూడా అంతే అనుకున్నారు. కానీ ప్ర‌తీ అబ‌ద్ధం నిజం కాద‌ని సురేంద‌ర్ రెడ్డి తేల్చేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here