ఆన్లైన్లో కత్తులు కటార్లు కొనేటప్పుడు జాగ్రత్త


స్నాప్ డీల్ అమెజాన్ లో లేక ఇతర ఆన్లైన్ సైట్స్ లో కత్తులు కటార్లు కొంటున్నారా, అయితే జాగ్రత్త మిమల్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మీరు కొనే కత్తి 9 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పుకన్నా పెద్దగా ఉంటె జాగర్త.ఇలాంటి కత్తులు ఆన్లైన్ సైట్స్ లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. అయితే ఇవి అమ్మడానికి కానీ కొనడానికి పర్మిషన్ లేదు అని అధికారులు హెచ్చరిస్తున్నారు.9 అంగుళాలకు పైనుంటే.. కత్తులు, కటార్లు, చురకత్తులు, తల్వార్‌లను ముందస్తు అనుమతితోనే విక్రయించాలి. 9 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పుకన్నా పెద్దగా ఉండే కత్తులు, డాగర్లు వంటి వాటి విక్రయాలు నిషేధం. వీటిని అమ్మాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తుపాకి, పిస్తోళ్లు విక్రయించే వారి మాదిరిగా లైసెన్స్‌ తీసుకోవాలి.అమేజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ సంస్థలు అంతర్జాలం ద్వారా విక్రయిస్తుండడంతో యువకులు, వ్యాపారులు దర్జాగా వాటిని కొంటున్నారు. ఇది చట్టవిరుద్ధం కావడంతో స్నాప్‌డీల్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్‌ సంస్థలపై చర్యలు తీసుకున్నామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here